దాశరధి,సి నారాయణ రెడ్డి జయంతి ; - వెంకట్ మొలక ప్రతినిధి:




 "ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణాల మెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కర్లు ఎందరో" భావన గల వ్యక్తి  స్వేచ్ఛను కోరిన మహాకవి* దాశరధి*.
"పరుల కొరకు పాటుపడని నరుని బ్రతుకు దేనికని మూగ నేలకు నీరందువని వాగు పరుగు దేనికని"అని ఆలోచించే మహాకవి ,అంతేకాదు,
"సంత నడుమ ఒక జోల పట్టి పసి గొంతు మోగుతుంటే నీవది గేయం అన్నావు నేనది గాయము అన్నాను" అను సాహిత్యపు ఆలోచనలు  చేకూర్చే సాహిత్యాన్ని అందించిన మహాకవి* డాక్టర్ సి నారాయణ రెడ్డి గార్ల శత జయంతి ఉత్సవాల సందర్భంగా, కొడంగల్ నియోజకవర్గం, వికారాబాద్ జిల్లా నందు అనంత సాహిత్య సాంస్కృతిక సాహితీ సంస్థ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో మొదటగా ప్రారంభ సభలో మహాకవులు దాశరథి రంగాచారి మరియు డాక్టర్ సి.నారాయణరెడ్డి గారి జీవన విధానం గురించి వారి సాహిత్యపు విలువల గురించి ముఖ్య అతిథులు ప్రసంగించినారు .అటు తర్వాత ఉన్నత పాఠశాలల విద్యార్థులకు తెలుగు భాష యందు అవధాన ప్రక్రియ గురించి పాఠం ఉన్నందున ప్రముఖ అష్టవాదాన్ని *అంజయ్య గారి చే అష్టావధానం చేయడం జరిగింది. పాఠశాలల విద్యార్థులు ఆనందించారు.
"అన్నపూర్ణ అమృతపాద్య అఖిల సృజన సంవేద్య హృద్య
 పద్య శృతి లయాద్య అవధానం ఆత్మవిద్య "అన్నట్లుగా వినడానికి వింపుగా ఉన్నటువంటి పద్యాలతో హాస్యంతో  ఎనిమిది ప్రక్రియల వృక్షకులకు సరిగా సమాధానాలు ఇచ్చి అందరిని ఆనందపరిచినాడు .చివరగా వికారాబాద్ ఇతర జిల్లాల నుండి వచ్చిన రచయితలు కవులు బృహత్కవి సమ్మేళనంలో తమ యొక్క కవితలను వినిపించారు .వారి రచనలలో ఆర్థిక ,సామాజిక ,నైతిక ,రాజకీయ విలువలు జారిపోకుండా ఎలా కాపాడాలో ఆ కవితులలో ప్రతిధ్వనించింది. ఈ కార్యక్రమాలలో నాతోపాటు డాక్టర్ సి పి రెడ్డి గారు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, సమాజంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కొరకు పౌరాణిక నాటకాలు వేసి విరాళాలు సేకరించి గ్రామాలకు అందించిన ఉపాధ్యాయుడు అంజయ్య పౌరాణిక నాటకాల నటుడు  తదితరులు పాల్గొన్నారు. మారుమూల ప్రాంతమైన కొడంగల్ నియోజకవర్గము గ్రామ ప్రజలు తమ నియోజకవర్గంలో ఇటువంటి సాహిత్య కార్యక్రమం జరగడం ఆనందంగా ఉందని సాహితీ సంస్థ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి దొరిటిరేటి పేరుతో ఉన్న రచయిత కవి పూర్తి బాధ్యత తీసుకొని సాహితీ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
ఈ కార్యక్రమంలో కవులు భాషా పండితులు ఉపాధ్యాయులు
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు
జనార్ధన్. శివకుమార్
 కవులు 
 వడిచర్ల సత్యం.
ఆశీర్వాదం. సంగం లక్ష్మీబాయి ప్రిన్సిపల్ రమణమ్మ
అంజిలప్ప
రవీందర్ గౌడ్
విద్యార్థులు పాల్గొన్నారు
కామెంట్‌లు