చంటోడు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
బుడిబుడినడకల బుజ్జాయి
చిట్టిచిట్టిపలుకుల చిన్నారి
సొట్టబుగ్గల సొగసరి
బంగరువన్నెల బుచ్చాయి

చిరునవ్వులు చిందాడు
చెంతకు వచ్చాడు
చేతులు చాచాడు
చంకను ఎక్కాడు

ముద్దులు ఇచ్చాడు
మురిపము చేశాడు
మాటలు చెప్పాడు
మైమరపించాడు

చిందులు తొక్కాడు
కేరింతలు కొట్టాడు
పకపకా నవ్వాడు
పరుగులు తీశాడు

చాకులెట్టు ఇచ్చాను
సంతస పడ్డాడు
నోటిలో వేసుకున్నాడు
చక్కగ చప్పరించాడు

బిస్కత్తు అడిగాడు
వెంటనే ఇచ్చాను
కసకస నమిలాడు
కడుపు నింపుకున్నాడు

బయటకు బయలుదేరాను
వెంటవస్తానని అన్నాడు
తీసుకొని వెళ్ళమన్నాడు
మారాము చేశాడు

అక్కదగ్గరకు వెళ్ళాడు
బొమ్మలు లాగుకున్నాడు
బాగా ఆడుకున్నాడు
బుడిబుడియడుగులు వేశాడు

ఆఫీసుకు బయలుదేరాను
టాటాబైబై చెప్పాడు
చకచకా చేతులనూపాడు
త్వరగారమ్మని సైగలుచేశాడు

నాబుజ్జి
నాకంటికివెలుగు
నాచిట్టి
నావంశోద్ధారకుడు


కామెంట్‌లు