శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 హిందీ లో భగవాన్ అంటే ఈశ్వరుడు పరమాత్మ అని అర్థం.సంస్కృతంలో భగవాన్ అంటే ఐశ్వర్యశాలి సౌభాగ్యశాలి పూజ్యుడు అని అర్థం.భగ+వాన్ అనేపదాలతో ఏర్పడింది.అథర్వ ఋగ్వేదంలో సౌభాగ్యం సమృద్ధి కల్యాణం అనే అర్థం లో వాడారు.వేదాల్లోభగవాన్ అంటే దాతా ఉదారుడుస్వామి అని చెప్పారు.దీని ప్రారంభిక అర్థం సౌభాగ్య శాలి‌ భాగ్యశాలి సమృద్ధిశాలి.క్రమంగా భగవాన్ అంటే దేవతలు మహాత్మా పూజనీయులకు వాడుతున్నాం.విష్ణు కృష్ణ శివ అంతా భగవాన్లే.భగ అంటే సూర్యుడు.ధనధాన్య ప్రతీకలు.
భడౌంచ్ భృగుమహర్షి ఆశ్రమం.అందుకే భడౌంచ్ అనేపేరు వచ్చింది.భృగుపుర్ భృగ్ కచ్ఛ భృగు కచ్ఛప్ అని కూడా పేరు.పశ్చిమసముద్రతీరంలో ఉన్న ఓడరేవు తీర్ధస్థలం.ఇక్కడే భృగు మహర్షి తపస్సులు గాయత్రీ మంత్రం జపించాడు.గరుడుడు కూడా తపస్సు చేశాడు.
భరత్ కూప్ చిత్రకూట్ దగ్గర ఉన్నది.అన్న శ్రీరాంకి అభిషేకం చేయడం కోసం భరతుడు పవిత్ర జలాల్ని సేకరించాడు.కానీ రాముడు అయోధ్యకు రానని చెప్పడంతో అత్రి మహర్షి ఆదేశాల ప్రకారం చిత్రకూట పర్వత సమీపంలో ఉన్న బావిలో ఆజలాన్ని కల్పాడు.అప్పటినుంచి ఆబావికి భరత్ కూప్ అని పేరు వచ్చింది.ఈబావినీటితో స్నానం చేస్తే ముక్తి లభిస్తుంది అని నేటికీ జనం నమ్ముతారు 🌹

కామెంట్‌లు