:సినారె జయంతిసందర్భముగా పద్యనీరాజనములు;- మిట్టపల్లి పరశురాములు
 తే.గీ
సింగిరెడ్డివంశంబున- శ్రేష్ఠుడతడు 
యవనియందునవెలసెను-
 కవిగతాను గేయములనెన్నొవ్రాసెను- పాయకతడు                             
 కీర్తి మిన్నగా పొందినా -మూర్తినతడు
తే.గీ
కలములోననునుండెను- కవితతల్లి
పదమునందుననుండెను-ఫరిమళమ్ము
కూర్పులందుననుండెను- 
కోకిలమ్మ సింగిరెడ్డినారాయణ -భంగిలేరు
తే.గీ
పుడమియన్మాజిపేటందు- పుట్టెనతడు
 పట్నమునకునువెళ్ళియు-పరగనుండె
పాటలల్లిసినీమాకు-మేటిగాను
ఒలకబోసెనుమధురాలు-తళుకులెన్నొ
ఆ.వె
కావ్యచక్రవర్తి-ఘనుడుసినారాయె 
భువనవిజయకీర్తి- కవితమూర్తి 
రాష్ట్రపతియుచేత-శ్రేష్ఠకానుకపొంది
తెలుగుభాషలోన- వెలుగు నింపె 
తే.గీ
కవులనందరిలోనను-ఘనుడుతాను 
డంబమింతైనలేనట్టి-దండివాడు 
ఆదరించెనుకవులను- నాత్మమీర
మరువజాలనిమహనీయ-మాన్యుడతడు
తే.గీ
వెళ్లె గీతాలువినిపించ -వేల్పులకును
మళ్ళిరాననిజెప్పెను-మనసువిప్పి
అమరనాధునిబహుమతి-నందుకొనగ
నుండు నచ్చటేజోహార్లు-దండిగాను
తే.గీ
కలమునందుననడయాడె-కవితలల్లి
మధురభావాలుకురిపించె-మాటలందు
పాటలందున రాగాల-నూటలాడె
వినినమదికెంతొకల్గించు-వీనులలర
                  ***


కామెంట్‌లు