డా.సినారే జయంతి యాదిలో......;- మాడుగులమురళీధరశర్మ
 చంమా-1
కలపులుతీయవే!యనుచు*
కాపొరిబిడ్డగవ్రా సినారె మీ!
కలమున జాలువారు పలు*
కావ్య,సుమాల్విరబూ సినారె మా!
తెలుగు గజళ్ళ రూపమును*
తీర్చుచుమార్గమువే సినారె
యా!
వలపులయాదివందన ని*
వాసిగ కీర్తిని డాసినారె హో!
ఉమా-2
చిత్రవిచిత్రసాహితిని*
చిత్రపుసీమన వే సినారె మీ!
ఛాత్రవ సంపదా విరుల*
చక్కని పాటలు వ్రా సినారె సొం!
పెక్కెడు సోయగమ్ములను*
ప్రీతిగ వర్ణనజే సినారె యా!
మక్కువ నౌయశస్సులను*
మాన్యతమీరగ డాసినారె గా!
శా
వర్ణావర్ణసువర్ణధారకవిగా*
వర్ణింపగాశక్యమే!
కర్ణాకర్ణసుకర్ణశ్రావ్యపటిమల్*
కావ్యాత్మగానిల్వగన్!
స్వర్ణాభర్ణవిరాజమానవపుషా*
వర్ణాధ్భుతప్రోతమై!
పూర్ణాపూర్ణత పూర్వజీవగతులై*
పూర్ణ స్సినారే గదా!

కామెంట్‌లు