సుప్రభాత కవిత - బృంద
అందాలెన్నో అందంగా
దాచుకున్న అందమైన అవనిలో
అందాలన్నీ అబ్బురంగా తోచే
అరుణోదయవేళ....

ఇలకు దిగివచ్చిన
కలల హరివిల్లులా
కనుల ముందు నిలచిన
కమనీయ దృశ్యం 

పచ్చగ మెరిసే రేకులతో
ముచ్చటగ మురిపిస్తూ
వరుసగ విరిసిన తోటలో
విరివిగ పూసిన పువ్వులు

పసిడి  మెరుపులతో
ప్రాగ్దిశ వెలుగుతుండగా
పుత్తడి రంగులతో నింగిని
వెచ్చని స్పర్శలతో నేలనీ

పలకరిస్తూ పులకరింపచేస్తూ
పచ్చని పువ్వుల పరవశింపచేస్తూ
ప్రభాసముగా  వెలుగులు
ప్రసరిస్తూ ప్రభవించు ప్రభాకరుని

కిరణాల చూపుతో తాకి
జగతికి జీవ చైతన్యమిచ్చి
ప్రగతి రథచక్రాల నడిపిస్తూ
సకల సృష్టినీ కాచు జగచ్చక్షువు

ఆగమనపు అపురూప 
క్షణాలను  స్వాగతిస్తూ

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు