..పిండి వంటలు ; .... కోరాడ నరసింహా రావు !
బడికి సెలవులు  అంటే.... 
  మాకైతే... సినిమాలు, షికార్లు కాదు....,
పిజ్జాలు - బర్గర్ లు కానేకాదు !
..   అమ్మమ్మగారిల్లో... 
.   నానమ్మగారిల్లో.... 
  మా కేరాఫ్  అడ్రెస్..... !
...అక్కడ వాళ్ళు ప్రేమతో చేసే కజ్జికాయలో, సున్నుండలో... 
 అరిశలో, బూరెలో... 
   పాకుండలో, పొంగడాలో... 
  ఇవి... ఇవే.... ఇవన్నీ... మామూలురుచిగావుండవ్... 
 ఎందుకంటే..., వాళ్ళ ప్రేమ... 
  అనురాగం, ఆప్యాయతలు 
 అన్నీ కలగలిసి చెప్పలేనంత రుచి... !
   లొట్టలేసుకు తినటమే మావంతు !!
    ఆ ఊరి జట్టుగాలతో.... 
   మరచిపోయిన ఆటలన్నీ... 
  అడిగి మరీ ఆడతాం..., 
  గుర్తొచ్చిన పల్లె పదాలు గొంతు కలిపి పాడతాం.. !
   దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, మాకు ఇట్టే గడిచిపోతాయ్ !
ఆ ఏటిలో ఈతలు... ఆ తోటల్లో.. కబురులు..ఆ సరదాలే వేరబ్బా.... !
  అందుకే నాలువురోజులు, సెలవొచ్చిందంటే చాలు ఇక్కడకు పరుగులెత్తుకోచ్చేస్తాం !  
  మీరూ అంతేనా..... ?
.    *******


కామెంట్‌లు