ప్రిజం నుండి ఏడు రంగులు ఎలా వస్తాయి?;- ఎస్. మౌనిక


  హలో! హాయ్ మై డియర్ ఫ్రెండ్స్! ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ..... మరి మీరు? విష్ యు ఏ వెరీ హ్యాపీ డే  🤝🤝..... ఈరోజు ఇంకో కొత్త విషయంతో మీ నేస్తం మీ ముందుకు వచ్చేసిందిగా!.... మనం స్కూల్లో ప్రిజం గురించి వినే ఉంటాం కదా!.... దానిమీద సూర్యకాంతి పడితే త్రిభుజం నుండి వచ్చే కాంతిలో ఏడు రకాల రంగులను మనం గమనించవచ్చు. అసలు ఈ తెలుపు కాంతి త్రిభుజం మీదికి వెళితే ఏడు రంగులు ఎందుకు వస్తాయి. ఆలోచించవలసిన ప్రశ్న లా ఉన్నట్టుంది?.... సరే అయితే! ఈ ప్రశ్నకి సమాధానం ఈరోజు తెలుసుకుందాం...... త్రిభుజాకారంలో ఉన్న ఒక గాజు ముక్కను ప్రిజం అని చెప్పవచ్చు. దీనిలో అడుగుభాగం యొక్క గాజు చతురస్రాకారంలోను.... పైన త్రిభుజాకారంలోనూ నాలుగు గాజు ముక్కలతో తయారు చేయబడి ఉంటుంది.తెలుపు రంగు కాంతి అంటే సూర్యకాంతి... ప్రిజం మీద పడినప్పుడు సూర్య కాంతి కిరణాలు ముందుగా కిందకు వంగుతాయి. తెల్లని సూర్యకాంతి ఏడు రంగుల సమ్మేళనం కావడం వలన ప్రిజం నుండి బయటకు వచ్చేటప్పుడు ఏడు రకాల రంగులు  వస్తాయి. ఆ రంగులు వివిధ కోణాల గుండా బయటపడతాయి. దీనినే మనం వర్ణపటం(spectrum) అంటాం. వంగపండు రంగు అన్ని రంగుల కంటే ఎక్కువ కోణంలో దారి తప్పుతుంది. ఎరుపు రంగు అన్నిటికంటే తక్కువ కోణంలో దారి తప్పుతుంది. అందువల్లనే ఎరుపు రంగు అన్నిటికంటే పైన మరియు వంగపండు రంగు అన్నిటికంటే కింద ఉంటుంది. చాలా కొత్తగా ఉంది కదా ఫ్రెండ్స్! ఇటువంటి ఎన్నో కొత్త విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా మరి! మీ నేస్తం ఎప్పుడు రెడీ గానే ఉంటుంది ఫ్రెండ్స్! ఓకే ఫ్రెండ్స్! మనం మళ్ళీ త్వరలో ఇంకో కొత్త విషయంతో కలుద్దామా మరి....బాయ్ ఫ్రెండ్స్! త్వరలో మన మళ్లీ కలుద్దాం....
కామెంట్‌లు