"సోమర్సెట్ మామ్";- కొప్పరపు తాయారు

 గత శతాబ్దంలో బహుళ జనాదరణ పొందిన 50 మంది గొప్ప రచయితల పేర్లు చెప్పమంటే   అందులో తప్పకుండా ఉండే పేరు సోమర్సెట్ మామ్. కథలు రాశారు ,నాటకాలు రాశారు యాత్ర రచనలు, కూడా చేశారు. ఏ సాహిత్య ప్రక్రియ చేపట్టిన అందులో ఘనవిజయాన్ని సాధించారు. సాహితీ మూర్తి.  అతడి పేరు చెప్తే సరికి ఆంగ్ల సాహిత్య ప్రియులకు" ఆఫ్ హ్యూమన్ బాండిచ్ " "రేజర్స్ ఎడ్జ్"   "కేక్ సెండ్ ఏల్స్" వంటి నవలలు జ్ఞాపకానికి వస్తాయి.
         ఈ మాటలు ఆయన చెప్పినవి.  "మిలియన్ల కొద్ది జనం తినడానికి లేకుండా మలమల మాడిపోతుంటే అనేక దేశాల రాజకీయ స్వాతంత్రం మృగ్యమవుతుంటే యుద్ధాల కారణంగా ప్రపంచంలో కోట్లాదిమంది జనం సుఖం అనేది లేక బతుకుతుంటే, జీవితము విలువలపై నమ్మకం సడలిపోతుంటే ఈ కథలు ఈ నవలలు నాటకాలు రాసి ఏం ప్రయోజనం ఇంకేం చేయలేము కాబట్టి ఇవి రాస్తున్నాం అంటూ ఆత్మ విమర్శ చేసుకున్నాడు మహానుభావుడు
       1935లో భారతదేశం పర్యటించినప్పుడు పర్యటించి తిరిగి స్వదేశానికి వెళ్ళినప్పుడు. అక్కడ వారు భారత దేశంలో మీరు చూసిన వాటిలో మీకు నచ్చింది ఏది అడిగితే...
        "ఇండియా పర్యటన నన్ను కదిలించింది తాజ్ మహల్ మధుర దేవాలయాలు కాదు .అవి చాలా గొప్పవే కానీ నన్ను కదిలించింది "బక్కచిక్కిన శరీరాకృతితో గోచి కట్టుకొని తెల్లవారుజామున పొలం పని చేయడానికి బయలుదేరి చలికాలంలో వణుకుతూ ,ఎండాకాలం అయితే చెమటలు కారుస్తూ,  పొలాల మధ్య సాయంసమయం అయిపోయేంత వరకు  శ్రమించి తన తండ్రి తాత ముత్తాతలు వలె పనిచేసి.. కొద్దిపాటి పంటతో కడుపు నింపుకొనే కర్షకుడు నన్ను కదిలించాడు అని చాలా గొప్పగా చెప్పారు రైతు గురించి....
         సాటి మనిషిని ప్రేమించు వీలైతే సాయం చెయ్ అంతేకానీ తీర్పు చెప్పి శిక్షించే అధికారం నీకు లేదు అని చెప్పిన సిసలైన మానవతావాది "సోమర్సెట్ మామ్".
కామెంట్‌లు