*అక్షర సుమాల మాలిక*;- అన్నాడి జ్యోతిరెడ్డి-- సిద్దిపేట‌.
 *సినారె గారి జయంతి సందర్భంగా*
============================
తెలగాణ రాష్ట్రాన , రాజన్నసిరిసిల్ల జిల్లాలో జూలై 29,1931నాడు
అవతరించె నొకరు హనుమాజిపేట‌ందు.
తండ్రి మల్లా రెడ్డి-తల్లి బుచ్చమ్మలకు
మురిపాల తనయుడుగ,
నారాయణరెడ్డి నామధేయము తోని
సింగిరెడ్డి  వంశ తిలకుడయ్యె.
సుందరమైనట్టి సుశీలమ్మతో
పరిణయంబు జరిగె బాల్యమందు.
నగుమోము గల్గిన నలుగురు తనయలకు
 నదుల పేర్లుబెట్టి సంతసించె.
కీర్తి కలిగినట్టి సాహితీ మూర్తియయ్యె.
నడక నా తల్లియని,పరుగు నా తండ్రియని,
సమత నా భాషయని,కవిత నా శ్వాసయని,

కలమును నమ్మినట‌్ట‌ి కవనశీలి ,చైతన్య దీప్తి.
ప్రజల నాల్కలందు పాట‌ల రూపాన
నిలిచి పోయినట‌్ట‌ి నిత్య కవనమాలి.
విశ్వంభరకావ్య విరచితంబు జేసి 
జ్ఞానపీఠపురస్కారమొందినట‌్ట‌ి  జ్ఞాన మూర్తి. 
గురువుగా సినారె గుర్తింపును పొందె
ఉపకులపతిగాను ఉన్నతస్థానాన 
వెలుగు నొందినట‌్ట‌ి తేజో మూర్తి.
తెలుగు గజల్లకు సృష్ట‌ికర్త యతడు
కవిత లతలనల్లె భవితకొరకు.
 సినీగేయములను ఘనముగాను రాసె,
నట‌న కౌశలముతో నలుగురిని మెప్పించి,
చిత్రసీమలోనూ  చిరస్మరణీయుడయ్యె.
కలము,గళము,కవిత గానమై బాసిల్లె
భరతమాత  ముద్దుబిడ్డగాను.
అందుకో సినారె వందనములు!!🙏🙏
         
కామెంట్‌లు