సుప్రభాత కవిత ; - బృంద
కిరణాలు తాకగానే
వెల్లివిరియు వెచ్చదనాలు
చిత్తడి నేలను  ఊరడించి
సాంత్వనిచ్చు ధైర్యాలు

పాలమబ్బుల  తెలివెలుగులు
పరవశించు పరిసరాలు
చురుకుమన్న  వేడికూడా
చింత దీర్చే పలకరింపులు

నీట తడిసిన బరువునుండీ
ఊపిరి తీసుకున్న పచ్చదనం
కొత్త వెలుగులో ముత్యమల్లే
మెరిసిపోతున్న  ప్రకృతి  సమస్తం

ఇలను తాకే ఒకో కిరణమూ
నింగి పంపిన ఆభరణము
ఆప్యాయత నిండిన ఆలింగనము
అభయమిచ్చే ఆత్మీయనేస్తము

వచ్చి పోయే అతిథులే
అతివృష్టి  అనావృష్టి 
జగతికెపుడూ ఆధారం
దినకరుని  అనుగ్రహం

ఎంతటి తప్పైనా మన్నించి
ఎంతటి కరుణైనా చూపించి
ఎంతటి వరాలైనా ప్రసాదించే
ప్రత్యక్షనారాయణుడి పాదాలకు

ప్రణమిల్లుతూ

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు