జీవిత సత్యాలు;- -'బాలబంధు' గద్వాల సోమన్న
 చెడు బుద్ధే ఉంటే
చెరుపునోయ్! జీవితం
ఆదిలో త్రుంచితే
అగును వర్ణశోభితం

అసూయే దుర్గుణం
చెడుగొట్టును బంధాలు
చెదలు వోలె వ్యాపించి
తినునోయ్ కుటుంబాలు

కోపగుణం శత్రువు
పతనానికి హేతువు
శాంతగుణం జీవం
వెలుగులీను దీపం

దురాశ రాచపుండు 
అగ్నిలా మండుచుండు
మనసుల్లో పుట్టితే
కుళ్లును బ్రతుకు పండు


కామెంట్‌లు