గీజా పిరమిడ్లు (ఈజిప్టు);- తాటి కోల పద్మావతి

 ప్రాచీన ప్రపంచంలోని ఏడు అద్భుతాల్లో గీజ పిరమిడ్లు ఒకటిగా ప్రసిద్ధి చెందాయి. ఆ కాలం నాటి ఏడు అద్భుతాలు గిజా పిరమిడ్లు మాత్రమే నేటికీ నిలిచి ఉన్నాయి. మానవ నిర్మిత ప్రాచీన మహా కట్టడాలైన గీజా పిరమిడ్లని ఆవరించి ఎన్నో రహస్యాలు కల్పనలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి.
1168 సంవత్సరంలో కైరోలో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో కైరో నగరం మొత్తం నాశనం అయినప్పుడు కైరో నగర ప్రజలు తమ ఇళ్ళను నిర్మించుకోవడానికి ఈ పిరమిడ్ మీది సున్నపురాతి పలకలు తొలగించడం వలన తర్వాత కాలంలో ఈ పిరమిడ్ 450 అడుగులకి తగ్గిపోయింది. దీనికి భూమి 570000 చదరపు అడుగులలో వ్యాపించి ఉంటుంది. ఒక్కొక్కటి రెండు పాయింట్ ఐదు టన్నుల నుంచి మూడు టన్నుల బరువున్న 25 లక్షల రాతి పలకలు ఈ పిరమిడ్ నిర్మాణంలో ఉపయోగించారు. ఈ పిరమిడ్ మొత్తం బరువు దాదాపు 62,50,000 టన్నులు ఉంటుంది. దీని నిర్మాణానికి 4000 మంది శ్రామికులకు 10 సంవత్సరాలు కాలం పట్టింది. లక్షమంది శ్రామికులు 20 సంవత్సరాలు తమ జీవితాలను ధారపోశారు. ఖపోస్ ఈ గ్రేట్ పిరమిడ్ లో సమాధి చేయబడ్డాడా? లేదా? అనేది ఎవరికి అంత చిక్కని రహస్యంగానే ఇప్పటికీ మిగిలిపోయింది.
క్రీస్తుపూర్వం 25 89-25 66 సంవత్సరాల మధ్య కాలంలో నిర్మించబడింది.
దీని ఎత్తు నిర్మించినప్పుడు 481 అడుగులు ఇప్పుడు 450 అడుగులు.
పరిమాణం-కోణము: ప్రతిపార్సం 775 అడుగుల పొడవుగా ఉంటుంది. ఆధార భూమి 5,70,000 దీని ఎత్తు 471 అడుగులు ప్రతిపక్షం 60 అడుగుల పొడవు.
గీజా పిరమిడ్లు మూడింటిలో మధ్య పిరమిడ్ ఖుపు కుమారుడైన చేబ్రెన్ తనకోసం నిర్మించుకున్నాడు. తమని తాము దేవుళ్ళుగా భావించుకొనే ఫారో చక్రవర్తులు తమ సామ్రాజ్యంలో ప్రపంచంలో గొప్పతనాన్ని చాటి చెప్పటానికి ప్రతీకలుగా గీజా పిరమిడ్లను నిర్మించడం జరిగింది.

కామెంట్‌లు