ఆటవెలది పద్యాలు
===============
గాసమింతలేక గాబరా బడుతుంది
పేదవాడి బ్రతుకు పెద్దగాను
వర్షము కురిపించె వరణదేవుడజూడు
దీన జనుల వైపు తీర్చు బాధ
కన్న బిడ్డలంత యన్నము దొరుకక
అంబయంటు నేడు యలమటించె
పసిడి కూన యరుపు పట్టదా? వరుణుడా!
కోపమేలకలిగె! కోర్కెదీర్చు
ఇల్లువాకిలంత కల్లాపి జల్లెను
వాన ,కదుల లేక వంట చేయ
లేక వనిత తంటలేపడె పలురీతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి