భారతమాత; - ఎం.వి. ఉమాదేవి -బాసర్

 1️⃣ఆ.వె
నాతి దారుణముల నలిగిపోవుచునుండ
తరలిరావె భరత తరుణినీవు
దుష్టకృత్యమూక  దునుమాడ రావేమి
కాళివోలె నీవు కనకదుర్గ!?
2️⃣
వలువలూడదీసి వనితల నడిపించ
దేశమాతలంత దీనులైరి 
నింటతల్లి చెల్లి నిటులజేయగలరె?
సింహవాహినివట సిగ్గు సిగ్గు!!

కామెంట్‌లు