న్యాయాలు -210
యుధ్యత్కుక్కుట న్యాయము
*****
యుధ్య అంటే పోరు లేదా పోట్లాట.కుక్కుటము అంటే కోడి,కోడి పుంజు.
యుధ్యత్కుక్కుట అంటే పోట్లాడే కోళ్ళు. అవి పోట్లాడుకునేటప్పుడు, విడదీసినా ,వెనక్కి లాగినా ఎంతకూ ఆగవు.వెనుదీయవు. పోట్లాటను అస్సలు ఆపవు .
పోట్లాట ప్రారంభం కాకముందు వాటికి శత్రుత్వం, వైరం వుందా అంటే అలాంటిదేం ఉండదు.అవి వేరు వేరు వ్యక్తుల ద్వారా వచ్చినవి.వాటికి వచ్చే వైరం లేదా పోట్లాట వ్యక్తులు కల్పించింది.కానీ సహజంగా వచ్చింది కాదు.
కోళ్ళ పందేల పేరిట వాటి యజమానులు తెచ్చిపెట్టిన వైరమే కానీ ఏ ఇతర కారణాల వలన కలిగినది కాదు.అయినా వాటిని బరిలోకి దింపిన తరువాత ఆ రెండు కోళ్ళ పోట్లాట భయంకరంగా, ఘోరాతి ఘోరంగా, ఏదో ఒకటి చనిపోయేంత వరకు ఉంటుంది.
వాటిని గురించి ఆలోచిద్దాం.పాపం అవి చాలా మూర్ఖమైనవి.తమ మధ్య ఎలాంటి వైరం లేదు కదా! అని ఆలోచించవు. తమను రెచ్చగొట్టిన యజమానుల ఆదేశానుసారం ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడతాయి.
ఇక కోడిపందేలు అనగానే తెలుగు వాళ్ళకు సంక్రాంతి పండుగ చటుక్కున గుర్తుకు వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో జోరుగా జరిగే కోడిపందాలు కళ్ళముందు మెదులుతాయి.కోడి పందేల కోసం ప్రత్యేకంగా పందెం కోళ్ళను పెంచుతూ .వాటితో కోడి పందేలు ఆడటం,వాటి మీద వందలు,వేలు, లక్షల్లో పందేలు కాసి డబ్బులు సంపాదించడం, పోగొట్టుకోవడం చూస్తుంటాం.
వింతేమిటంటే ఈ కోడిపందాలకు సంబంధించిన కుక్కుట శాస్త్రాన్నే రాసారు మన భారతీయులు. నక్షత్రాల ప్రభావం కేవలం మనుషుల మీద ఉంటుందని తెలుసు. కానీ పక్షులు, జంతువుల మీద ఉంటుందని వాటి గురించి ఓ పంచాంగాన్ని అంటే కుక్కుట శాస్త్రాన్నే రాయడం ఆశ్చర్యంగా ఉంది కదండీ!
ఇక ఈ న్యాయంలోని అంతరార్థం ఏమిటో చూద్దాం. అమాయకపు,మూర్ఖపు కుక్కుటాళ్ళాంటి వాళ్ళు మనుషుల్లో కూడా ఉండటం గమనించి మన పూర్వీకులు వారిని ఇలా "యుధ్యత్కుక్కుట న్యాయము"తో పోల్చారు.
దీనికి సంబంధించిన ఉదాహరణలు కోకొల్లలు.రాజుల చరిత్రలు చదివినా ప్రజాస్వామ్యంలో పాలకుల పాలన చూసినా ఈ న్యాయము ఎంత అక్షర సత్యమో తెలుస్తుంది.
ఇరు రాజుల మధ్య, దేశాలను పాలించే నాయకత్వం మధ్య వైరమే ఆధిపత్య పోరే కానీ అందులో నివసించే ప్రజలు,సైనికులది కాదు కదా!.
కానీ ఇరు రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాలలో ప్రాణాలను పణంగా పెట్టి హోరా హోరీ పోరాడుకునేది సైనికులూ, సామాన్య ప్రజలే. చివరికి ప్రాణాలు కోల్పోయేదీ వాళ్ళే.వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి సురక్షితంగా ఉండేది మాత్రం వాళ్ళ యజమానులే.
చరిత్రలో జరిగిన ఆధిపత్య పోరాటాల ఉదంతాలన్నీ ఇవే విషయాలను చెబుతాయి.
రాజకీయ పార్టీలలో తిరిగే కార్యకర్తలు కూడా ఇలాగే ఉంటారు.తమ పార్టీల యజమానుల కనుసన్నల్లో వుంటూ ఇతర పార్టీల కార్యకర్తలను బద్ద శత్రువులుగా భావించడం చూస్తూ ఉంటాం.
ఏది ఏమైనా ఈ "యుధ్యత్కుక్కుట న్యాయము" వల్ల మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎందుకు ఏమిటి ఎలా అనే విచక్షణతో కూడిన ఆలోచన లేకుండా మూర్ఖ కుక్కుటాళ్ళా వుంటే నష్టం తమ జీవితాలకేననే సత్యాన్ని గ్రహించడం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి