తత్వగీతం :- చేసిన పాప...... !- కోరాడ నరసింహా రావు !
సాకీ :-
ఆనందము అనుకునేవు.... 
  దుఃఖములో  మునిగేవూ.... 
  ఇది ఏమి ర జీవా..... !
     నిజము తెలుసు కోవా... !!

పల్లవి :-
        చేసిన పాప - పుణ్యములరెక్కలు కట్టుకు.... 
   మరో జన్మమును ఎత్తేవు... 
 ఆ కర్మ ఫలములను అనుభ వించుచూ... వీడక, పాప - పుణ్యములు చేసేవు.... !....2

చరణం :-
           జనన - మరణముల వల యములో పడి, ఎన్నాళ్లిలా ఈదేవు !?
  ఈ ప్రపంచ సాగర తీరం చేరి... 
 నీ నిజ గమ్యమెపుడు చేరేవు?!....2
         " చేసిన  పాప...... "

చరణం :-
.         ఎంత ఈదినా... ఇందు అలసటే తప్ప, ఆనందమేమి ఉన్నదిరా.... !?
    నీ నిజ స్థాన ఆనందము ముందు, ఆ స్వర్గము కూడా చిన్నదె రా......!!....2
       ********

కామెంట్‌లు