న్యాయాలు -208
యత్ప్రాయః శ్రూయతే న్యాయము
******
యత అంటే ఎందుకంటే అని అర్థము.ప్రాయ అంటే ఎక్కువగా, తరచుగా ,సాధారణంగా, సాధారణ నియమం వలె, చాలా వరకు, చాలా మటుకు, బహుశా, సమృద్ధిగా అనే అర్థాలు ఉన్నాయి.శ్రూయతే అంటే విన్నదే మంచిది, ఉత్తమమైనది అని అర్థము.
ఏదైతే తరచుగా సాధారణంగా వింటూ వుంటామో అదే నిజమని నమ్మడం లోక స్వభావము అనే అర్థంతో ఈ "యత్ప్రాయః శ్రూయతే" న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
నిజం కంటే అబద్దమే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.దానిని పదిమంది నోటి నుండి పదే పదే వినడం వల్ల అదే నిజమని నమ్మడం లోకంలోని జనుల నైజం.
అందుకే మన పెద్దవాళ్ళు ఓ సామెత చెబుతూ ఉంటారు.
"నిజం చెప్పులేసుకునే లోపలే అబద్ధం ఊరంతా చక్కర్లు కొట్టి వస్తుందని."
"లోకులు పలు గాకులు" కూడా.వారు ఊరంతా అరిచి నిజమని నమ్మేలా భ్రమల్లో ముంచేస్తారు. అది వాళ్ళ తప్పు కూడా కాదు. ముందుగా చేసిన ప్రచారం అంత బలంగా ఉంటుందన్న మాట.ఇలా అసలు నిజం తెలుసుకునే లోపు జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది.
నిజానికి హంగులు, రంగులు ఉండవు.చాలా సాదాసీదాగా ఉంటుంది. అదే అబద్దం అయితే దాన్ని నమ్మే విధంగా రకరకాల రంగులతో మనసును మాయ చేస్తుంది.
ఇంతెందుకూ మనం నిత్యం వార్తల్లో వింటూ, చూస్తూ ఉంటాం. ఫలానా చిట్ ఫండ్ కంపెనీ లేదా సంస్థ లక్ష రూపాయలు చెల్లిస్తే పది లక్షలు ఇస్తామని చెప్పిందనీ, అది నమ్మి లక్షల్లో మోసపోయారనీ... ఒక వార్త విన్న తర్వాత అందులో సాధ్యాసాధ్యాలు, నిజానిజాల గురించి లోతుగా ఆలోచించక పోవడమే దీనికి కారణం కదా!
అందుకే అసలు కన్నా కల్పితమైన, మోసపూరిత వార్తలకే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది.అలా జరిగేందుకు కొందరు తమ అతి తెలివి తేటలతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకోవడం చూస్తున్నాం.
ఇవన్నీ ఆనాడే అనుభవంలోకి వచ్చాయి కాబోలు వేమన ఓ చక్కని పద్యాన్ని మన కోసం రాశారు.
"పదుగురాడు మాట పాటియై ధర చెల్లు/ ఒక్కడాడు మాట ఎక్కదెందు " అంటాడు.
తప్పు వార్తల గురించి అవి తప్పు అని నిజం తెలిసిన వ్యక్తి ఎంత చెప్పినా అతని మాటను పట్టించుకోరు.
అందుకే చాలా సార్లు అబద్దమే రాజ్యమేలుతుంది.
పరిశోధనల విషయంలో కూడా ఎంతో మంది శాస్త్రవేత్తలు, తత్త్వ వేత్తలు చెప్పిన మాటలు,చేసిన ప్రయోగాలు,పరిశోధనలు వాళ్ళ కాలంలో ప్రజలు నమ్మక పోవడంతో పాటు బ్రూనో, సోక్రటీస్ లాంటి వారిని చంపడం. వారు మరణించిన తరువాత అవి నిజాలని తెలుసుకోవడం చరిత్రలో చదువుకున్నాం.
ఇలా తప్పుడు ప్రచారాలు,మోస పూరిత ప్రకటనలు పదే పదే వినడం వల్ల అవి నిజమని నమ్మడం మానవ నైజం కాకూడదనే అంతరార్థం ఇందులో ఇమిడి ఉంది.
అలా పదే పదే విన్న విషయాల్లో నిజమెంతో నిగ్గదీసి తెలుసుకోవాలనీ ఈ "యత్ప్రాయః శ్రూయతే న్యాయము" ద్వారా గ్రహించి, జాగ్రత్తగా ఉందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి