నిత్యం ఉదయం నుండి రాత్రి పడుకునే సమయం వరకు, అంతే కాదు నిద్రలో కూడా భగవన్నామ స్మరణ చేసుకుంటూ, నిష్టగరిష్టుడై దైవారాధన చేస్తూ, యజ్ఞయాగాలు చేస్తూ, జప తప దానాదులతో భగవానుని సంతృప్తి పరుస్తూ ఉన్న ఓ భక్తుడు నారాయణ స్మరణ చేస్తూ ఓ రోజు అరణ్యం గుండా ఒంటరిగా ప్రయాణిస్తూన్నాడు.
దేవ దేవుడు శ్రీమన్నారాయణుడు అది చూచి ఆ భక్తునికి ఇకనైనా ప్రత్యేక్షం అయ్యి ఆ భక్తుని కోరిక తీరుద్దామనుకుని శంఖ చక్ర గదా ధారియై పట్టు పీతాంబరం ధరించి చిరునవ్వులు చిందిస్తూ ఆ భక్తునికి దారికి అడ్డంగా నిలుచున్నాడు.
భక్తుడు చూచాడు. ఒక్క క్షణం తనను తానే మరిచి పోయాడు ఆ దివ్య మంగళ స్వరూపము చూసి. అలవోకగా చేతులెత్తి దండం పెట్టబోయి ఆగిపోయి తన తలపై ఉన్న తలపాగాను ఆ పరమాత్మ చేతిలో బెట్టి తన మానానా తాను నడుచుకుంటూ వెళ్ళసాగాడు .
అలాగే అవాక్కాయ్యాడు నారాయణుడు.తనకు తానుగా ప్రత్యేక్షం అయి వరాలిద్దాం అనుకుంటే ఇలా నాకే దానం చేసి పోతాడేంటి అనుకుని మళ్ళీ దారికి అడ్డు వచ్చాడు. ఈసారి తన భుజం పైనున్న తువ్వాలు దానం ఇచ్చాడు.
మూడో సారి మళ్ళీ నారాయణుడు దారికి అడ్డం వస్తే తాను వేసుకున్న చొక్కా దానం చేస్తూ "ఓయీ ఇప్పుడు నా వద్ద దానం చేయడానికి మరేమి వస్త్రాలు లేవు. నేను నడుముకు కట్టుకున్న వస్త్రం తప్పా."
"ఇలాగా నువ్వు ప్రతీ సారి నా దారికి అడ్డంగా వచ్చి ప్రయోజనం లేదు ఈ అడవిలో. మానవ సంచారం ఉన్న చోటుకు నీ ఈ వేషం తో వెళ్తే నీకు ఎన్నో బహుమతులు దానాలు ఇస్తారు కాబట్టి మనుషులు తిరిగే నగరాలకు వేళ్ళు. నీ వేషం చాలా బాగుంది. నిజంగా నారాయణ మూర్తి లాగా ఉన్నావు"
అనగానే అలాగే ఆశ్చర్యం చెందాడు శ్రీమన్నారాయణుడు.
నేను నిజంగా భగవంతుడినే నీ భక్తికి మెచ్చి నువ్వు కోరిన వరాలు ఇద్దామని వచ్చాను కోరుకో అని ఎంతగానో ప్రాదేయపడి బ్రతిమిలాడినా ఆ భక్తుడు నమస్కరిస్తూ నా దారిన నన్ను వెళ్ళనియ్యి బాబూ.నన్ను నీ మాయ మాటలతో మోసాగించాలని చూడకు.
దైవం అంత తొందరగా మానవులకు తన రూపాన్ని చూపడు.నువ్వు నగరానికి వెళ్లి నీ మాయలు అక్కడ చూపించి ధనం సంపాదించుకుని హాయిగా బ్రతుకు అని అంటూ ఆ భక్తుడు ఆలా వెళ్తుంటే............................
అప్పుడు అనుకున్నాడు పరమాత్ముడు తన మనసులో.
ఈ భక్తులకు పశు పక్ష్యాది మానవ రూపంలోనే కనిపిస్తూ వారు కొరకుండానే వారికి ఏది మంచి చేయాలో అదే చేయాలి ఈ కలియుగంలో అని వైకుంఠం వెళ్ళాడు ఆ దేవ దేవుడు.
ఏ పుట్టలో ఏ పాముందో. అందుకే అన్నిటిని అందర్నీ ఆదరించాలి. సకల జీవాలకు సంరక్షణ చేయాలి.
లోకస్సమస్తా సుఖినో భవంతూ 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి