కాలం ఆగదు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 మనిషి జీవించడానికి అనేక మార్గాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి  అయితే ఏ మార్గాన్ని ఎవరు అనుసరించాలి  దానిని ఎలా ఎన్నుకోవాలి  అన్నది సందేహం  టు డు  ఆర్ నాట్ టు డు  అంటాడు షేక్స్పియర్  ఇది చేయడమా మానుకోవడమా  చేస్తే ఏ లాభాలు ఉన్నాయి చేయకపోతే ఏ నష్టాలు ఉన్నాయి  ఈ రెంటినీ తులనాత్మకంగా ఆలోచించి  తన నిర్ణయం తీసుకోవడం సబబు అయితే  అతనికి ఆ నిర్ణయాత్మక శక్తి ఉన్నదా లేదా అన్నది సందేహం  నేను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల  నాకు మంచి జరుగుతుందా ఇతరులకు మంచి జరుగుతుందా అని ఆలోచించేవారు ఉన్నారు  దీనివల్ల సందిగ్ధంలో  కాలాన్ని మర్చిపోతాం  ఆ కాలం మన కోసం ఆగదు కదా  టైం అండ్ టైడ్  వెయిట్ ఫర్ నో మ్యాన్  అన్నది శాస్త్రం. హనుమంతుడు అంటేనే బుద్ధికి  పెట్టింది పేరు  ఎలా మాట్లాడాలో ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో ఎందుకు మాట్లాడాలో  మాట్లాడేటప్పుడు ఎలా ప్రవర్తించాలో అన్నీ ఆంజనేయునికి తెలిసినట్లుగా ప్రపంచంలో ఎవరికీ తెలియదు అని ఆదికవి వాల్మీకి మహర్షి  కితాబు ఇచ్చారు  కానీ సీతమ్మ వారిని వెతకడానికి వెళ్ళినప్పుడు  ప్రతి అంగుళాన్ని పరిశీలనగా చూస్తూ  చివరకు మండోదరి గదికి వెళ్ళినప్పుడు  ఆమెను చూసి  అంత క్రితం సీతమ్మవారిని చూసిన దాఖలాలు లేవు అమ్మవారు ఇక్కడ ఉన్నారు  అతని మనసును తునా తునకలు చేసింది  బుద్ధి పనిచేస్తుంది కనుక ఆ మహా పతివ్రత ఇలాంటి నీచుని గదిలో ఎందుకు ఉంటుంది అని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఇలాంటి సందేహాలు మామూలు వ్యక్తికి కలిగితే  అతను ఎలా ప్రవర్తిస్తాడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అని ఆలోచిస్తే  తనకు తెలిసిన మిత్రులను లేదా గురువును ఆశ్రయించి  ఇలా జరిగింది దీని పరిష్కారం ఏమిటి అన్న స్థితికి వస్తాడు కానీ  సరియైన నిర్ణయం తీసుకోవడం అతనికి చేతకాదు  దానికి కారణం మనసు  ఇది ఎంతో చంచలమైనది  ఏ క్షణానఎలా మొగ్గుతుందో ఏం ఆలోచిస్తుందో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దానికి అర్థం కాదు  ప్రతిదీ తనకు కావాలనే కోరుకుంటుంది మనసు దానికి ఒనరులు ఉన్నాయా  దానికి మనం తగినవారమేనా అన్న విచక్షణ కూడా  దానికి ఉండదు  కనుక  ఏ మనిషి అయినా ముందు జాగ్రత్త పడవలసినది తన మనసును తన ఆధీనంలో ఉంచుకోవడం  దీనివల్ల ఎలాంటి అనర్థాలు రావు  మంచి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఆలోచించండి.



కామెంట్‌లు