పుస్తకాలు మణి మాణిక్యాలు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 కొంతమందిని చూసినప్పుడు  అతని చేతిలో ఎప్పుడూ ఒక పుస్తకం కనిపిస్తూ ఉంటుంది  ఏ పుస్తకం చదువుతున్నాడు అతనికి  ఏ సాహిత్యం అంటే  ఇష్టం అనే విషయాల గురించి ఎవరూ మాట్లాడరు  కొంతమంది చెప్తూ ఉంటారు నేను వెయ్యి పుస్తకాలు చదివాను 2000 పుస్తకాలు చదివానని  పుస్తకం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పేజీలు తిరగడం కాదు  దానిలో రచయిత గాని కవి గాని ఏ విషయాన్ని మనకు తెలియాలని అనుకున్నాడో  ఆ తెలియచేసిన విషయాన్ని అర్థం చేసుకుని  దానిని జ్ఞాపకం చేసుకున్నవాడు చదివినట్టు లెక్క  అలా చదివిన వారిని ఒక్కరిని చూయించండి అంటున్నాడు జూలియస్ సీజర్  కొంతమందికి ఈ ప్రపంచంలో ఉన్న  వెళ్లి  ఇంకా ఈ జీవితంలో నేను చూడవలసిన ప్రదేశాలు ఏవి లేవు అని ఆలోచించే వారికి
నీకు నిజంగా ఆ అభిప్రాయం ఉన్నట్లయితే  ప్రయాణాలకు సంబంధించిన  అనేక పుస్తకాలు మన ముందు ఉన్నాయి  ఒక్కొక్క యాత్ర చేసిన వ్యక్తి ఒక్కొక్క విషయాన్ని గురించి ఆ 
మూలగ్రం మనకు అర్థమయ్యేలా అతను చూసిన ప్రతి గ్రామం పట్టణం  అక్కడి ప్రజల పరిస్థితులు వాతావరణం అన్ని దాంట్లో  పొందుపరిచి పుస్తక రూపంలోకి తీసుకొని వచ్చాడు  లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని నీవు  ప్రయాణం చేసి ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవలసిన అవసరం లేదు  పెద్దలు వెళ్లి చూసి వారి అనుభవాలతో సహా వ్రాసిన పుస్తకాలు  ఎక్కడ దొరుకుతాయి అని మాత్రం ఆలోచించు  ఏ పుస్తక సేవలో దొరికినా ఆ పుస్తకాన్ని  వెంటనే కొని భద్రపరిచి  నీవు ఏ దేశం వెళ్ళదలుచుకున్నావో దాని గురించిన  వివరాలన్నటిని  తెలుసుకోవచ్చు నట్టున్నాడు టెస్ట్ కార్డ్స్. సామాన్యంగా చిన్నపిల్లల  పుట్టినరోజుకు బహుమతులు ఇవ్వడానికి పెద్దవారు వస్తూ ఉంటాడు  ఆ వచ్చేవారు  అతనికి ఇష్టమైన బొమ్మలను ఆట వస్తువులను  కొత్తగా అంగడికి వచ్చిన వస్తువులను తీసుకువచ్చి బహుమతి ఇవ్వడం  ఆనవాయితీ  కానీ  విన్స్టన్ చర్చిల్  ఏ పిల్లలకు నీవు బహుమతి ఇవ్వదలచు చుకుంటున్నావో ఆ పిల్లవాడి వయస్సు తెలుసు కనుక  ఆ వయసులో అతను జీర్ణించుకోగలిగిన చక్కటి పుస్తకాన్ని  అందమైన పుస్తకం అని కాదు  దానిలో నీతి బోధకమైన విషయాలు కానీ జీవితంలో అతను నేర్చుకోవాల్సిన  పద్ధతులు కానీ ఉన్న పుస్తకాన్ని తీసుకొని ఇస్తే  నీ తృప్తితో పాటు  అతని జీవితానికి మార్గదర్శకడివి  అయ్యే అవకాశం ఉంటుంది అంటాడు  పుస్తకాలు  మనసులో దాచు  కోవలసిన  మణి మాణిక్యాలు.


కామెంట్‌లు