స్వ- అర్థం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 ఈ ప్రపంచంలో చీమ నుంచి శివుని వరకు  ప్రతి ఒక్కరూ మనకు జ్ఞానాన్ని కలుగజేసే వారే  మీరంతా కలిసి ఉంటే ఈ ప్రపంచంలోమీరు చేయలేని పని ఏదీ లేదు అంటూ చెబుతోంది  ఆ చీమలలో ఉన్న ఐక్యత మనం గమనించినట్లయితే  మనం  ఏ లోపం వల్ల ఇలా మన జీవిస్తున్నామో తెలుస్తోంది  ఇవాళ కొత్తగా స్త్రీకి సంబంధించిన స్వాతంత్రం స్వేచ్ఛ గురించి మాట్లాడేవారు  శివుని ఆదర్శంగా తీసుకున్నట్లయితే  అర్ధాంగి అంటేనే నీలో సగం ఆమెలేని నీవు లేవు  అన్న సత్యాన్ని గమనించి  ఆమెను కూడా నీతో పాటు గౌరవిస్తూ  జీవితంలో కలిసి మెలిసి ఉండాలి  ఎలాంటి పొరపొచ్చాలు ఉండకూడదు ఇద్దరూ కలిసి చేస్తేనే ఆ కుటుంబం ఏ పని అయినా సక్రమంగా  నిర్వహించవచ్చును అజ్ఞానం శివుని వల్ల మనకు కలుగుతుంది. జీవి లేని చెట్టు కూడా నీకు జీవితాన్ని గురించి తెలియజేస్తుంది  మనం గమనించలేం అంతే  ఏ జీవి అయినా నీకోసమే ఉంటుంది  గేదె  నీకు పాల ద్వారా జీవాన్ని ఇస్తుంది  దున్న  రైతుకు సహాయకారిగా ఉంటుంది  ఎద్దు లేనిదే వ్యవసాయమే లేదు  కోడి తన గుడ్డు నీకు ఆహారంగా ఇస్తూ తననే నీకు ఆహారంగా తయారు అవుతుంది  ఇలా ఏ జంతువుని ఏ పశువుని తీసుకున్న  మానవునికి సేవ చేయడం కోసం మానవునికి జీవాన్ని ఇవ్వడం కోసం  ప్రయత్నం చేస్తున్నవే తప్ప  తాము జీవితంలో ఏదో చేయాలని  పేరు ప్రఖ్యాతులు పొందాడన్న స్వార్థం వాటి మనసులో ఉండదు  స్వార్థం అనేది ప్రత్యేకంగా ఈ ప్రపంచంలో ఒక మానవునికే  సొంతం  ఆంగ్లంలో చెప్పే స్వార్థానికి  నీ తత్వం తెలుస్తోంది. అన్నీ నీకే కావాలి  ఏ కొత్త వస్తువు కనిపించిన అతని ఇంట్లో ఉండాలి  ఎంతో ధనాన్ని సంపాదించాలి  అన్న ఆలోచనలు తప్ప మరొకటి ఉండదు  అదే ఆంధ్ర భాషలో ఉన్న స్వార్థం స్వ అర్థము  అన్న పదాన్ని విశ్లేషించినట్లయితే నీ ధర్మం ఏదైతే ఉన్నదో దానిని నిర్వర్తించడం కోసం ఏర్పాటు చేసుకున్న పదం  నీ ప్రయోజనం కోసం మీ కుటుంబం కోసం నువ్వు ఏం చేయాలో అది బాధ్యతగా చేయడం అనేది స్వార్థం  ఇతరులను ఇబ్బంది పెట్టకుండా నీ కాళ్లపై నీవు నిలబడి  నీ ఆహారాన్ని నీవు  ఏర్పాటు చేసే ప్రతి పని నీ స్వార్థమే  ఆ స్వార్థానికి అర్థం తెలిసినట్లయితే  మరో జాతి భాష పై మనం ఆధారపడవలసిన దుస్థితికి రామ్  అది ఒక్కటి జ్ఞాపకం పెట్టుకుంటే మనం భాష  మన సంస్కృతి మన సంప్రదాయం  శాశ్వతంగా నిలిచి ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కామెంట్‌లు