అతిధి మర్యాద- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి ప్రాణికి దాని బాధ్యత దానికి తోడు ధర్మం  ఉండి తీరుతుంది  ఎవరి ఆహార సమపార్జన వారు చేసుకుంటూ పశుపక్ష్యాదులతో సహా  తమ కుటుంబ సభ్యులను కూడా పోషించడం  అతిథి అభ్యాగతి ఎవరు వచ్చినా  వారికి సకల ఉపచారాలు చేసి పెట్టడం  విధి  గా భావించింది లేదా  సమయం కాని సమయంలో వచ్చి  అవతల వ్యక్తి తెలిసినా తెలియకపోయినా  అమ్మా ఆకలి అంటే అతని  బాధ  తీర్చవలసిన ధర్మం గృహిణి తీసుకుంటుంది  అతను వచ్చే సమయం కానీ సందర్భం కానీ  తనకు తెలియదు  వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది  కాదు  కనుక ఆ ఇంటిలో ఉన్న ఏ వస్తువులు మిగిలితే దానితోనే అతని కడుపు నింపడానికి ప్రయత్నిస్తుంది  ఆ గృహిణి. ఆ వచ్చిన అతిధి కూడా ఆమె ఏది వడ్డించినా దానిని స్వీకరించాలి ఎలాంటి  ఆంక్షలు పెట్టడానికి వీలు లేదు  అలాగే అభ్యాగతి పద్ధతులు వేరు  నేను ఫలానా సమయంలో వస్తాను అని ముందే తెలియచేసి  ఆ సమయానికి తనకు ఏ పదార్థాలు ఇష్టమో  అవన్నీ చెప్పి వాటితో తన భోజనం ఉండాలని అంటాడు ఆ  ఇల్లాలు అతను చెప్పినట్టుగా  అన్ని పదార్థాలువండి  అతనిని తృప్తి పరుస్తుంది  అలా ధర్మాన్ని పాటించిన  ఇల్లాలు  స్వచ్ఛందంగానే చేస్తుంది తప్ప  స్వార్థంతో కానీ  వారి నుంచి ఏదో ఆశించి కానీ ఆ పని చేయదు అలాగే వచ్చిన వారికి కూడా  వారి ధర్మాలను వారు ఆచరించి తీరాలి  గౌరవ ప్రదంగా వచ్చిన వ్యక్తి  ఆ గౌరవాన్ని అగౌరవపరచకూడదు  ఈ వ్యక్తి మనసును  ఛీకాకు పరచడం కానీ కష్టపెట్టడం కానీ ఉండకూడదు  అలా అతని ధర్మాన్ని అతను కాపాడుకోవాలి. ఆ రోజులలో భోజనం అరిటాకులపై  వడ్డన జరిగేది  దానికి ప్రత్యేకమైన కారణం  తాను వడ్డించిన భోజనాల్లో ఏ విధమైన విష పదార్థం ఉన్నా  ఆ ఆకు రంగు మారిపోతుంది  దానితో ఆహారాన్ని వారు ముట్టడానికి వీలులేదు  ఆరోజులలోనే శాస్త్రీయమైన దృక్పథం అలవర్చుకున్న  సనాతన ధర్మాన్ని పాటించిన వారు.  ఇవాళ  స్టీలు కానీ  పింగాణి కానీ  కంచంలో  ఒకరు భోజనం చేసిన తరువాత కడిగి మరొకరికి ఆ తర్వాత ఇంకొకరు అలా అనేకమంది  ఓకే కంచంలో తినే సంప్రదాయం ప్రారంభమైంది  ఆరోజు వ్యాస మహర్షి చెప్పిన  పద్ధతి శ్రీకృష్ణుని ద్వారా  ద్రౌపతికి వినిపించిన విషయం  ఒక్కసారి  రోగ కారక క్రిములనుంచి  వ్యక్తిని ఎలా  రక్షించుకోవాలో  ప్రతి ఇల్లాలికి తెలుసు  ఆ పద్ధతి పునరావృతం అయితే  సమాజంలో ఆరోగ్యం పెరగడానికి అవకాశం ఉంటుంది  ఆలోచించండి.


కామెంట్‌లు