సనాతనుల విద్య;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 సనాతనుల విద్య విధానంలో మొదట నేర్పేది పెద్ద బాలశిక్ష  ఇందులో అక్షరాలన్నీ అక్షరాల కలయికతో పదాలు ఎలా వస్తాయో  పదాల కలయికతో వాక్యం ఎలా ఏర్పడుతుందో  ఆ ఏర్పడిన వాక్యాన్ని ఎలా మనం ఉపయోగించాలో ఏ మాటకు ఎలాంటి అర్థం ఉందో దానికి వ్యతిరేకార్థం ఏవైనా ఉందా  అన్న విషయాలన్నిటినీ కూలంకషంగా చిన్న పిల్లలకు అర్థమయ్యే పరిస్థితిలో రాసి  చిన్న చిన్న కథలను అల్లడం నేర్పిన పుస్తకం అది.  చిన్నతనంలో ఆ పుస్తకం చదివిన తర్వాత మరో పుస్తకం  చదివే అవసరమే ఉండదు  అంత అందంగా అంత ప్రణాళికా బద్ధంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే పద్ధతిలో ఆ పుస్తకం  ప్రతివారు చదువవలసిన పుస్తకంగా  కీర్తించబడిన పుస్తకం పెద్ద బాలశిక్ష.
ఏనుగు వీరస్వామి గారు అన్న  భక్తుడు కాశీ యాత్రకు వెళ్లి  అక్కడ  ప్రతి విషయాన్ని  అవగాహన చేసుకుని  ఒక సందర్భంలో కాశీకి వెళ్లిన వాడు కాటికి వెళ్లిన వాడు ఒకరే అన్న స్థితికి  సమాజం వచ్చింది  వారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత అడవులలో కూడా  ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చేది  విష జంతువులు క్రూర మృగాలు  మన కంటికి కనిపించని అనేక రకాలైన కీటకాలు మనల్ని  అనారోగ్యం పాలు చేసినప్పుడు  మధ్యలోనే మరణించడం సంభవిస్తూ ఉంటుంది  వారితో పాటు వారి బంధువులు కూడా అక్కడితో ఆగిపోతారు  ఇలాంటి అవాంతరాలను ఎదుర్కోవడం కోసం తాను పడ్డ కష్టాలు ఇతరులు పడకూడదన్న అభిప్రాయంతో కాశీ యాత్ర మన ముందుకు వచ్చింది  అది చదివిన తర్వాత  మరెవరిని అడగకుండా ఏకాంతంగా  కాశీ వెళ్లి రావచ్చు. కాశీ మజిలీ కథలు పేరుతో రాసిన ఈ పుస్త

కంలో  ఎక్కడ నుంచి బయలుదేరితే ఏ మార్గం ద్వారా వెళ్ళాలో  ఆ మార్గంలో ఎలాంటి కష్టాలు బాధలు ఉంటాయో  వాటిని ఎదుర్కొని ముందుకు నడవడానికి మార్గాలు ఏమిటో  ఆ విషయాలన్నిటినీ దాంట్లో కూలంకషంగా  చర్చిస్తూ రాశారు  అప్పట్లో హోటళ్లు లేవు  పూటకూళ్లమ్మ పేరుతో  ఒక ముసలి స్త్రీ  తన ఇంటిలోనే వంట చేసి  బాటసారులలో ఎవరైనా వచ్చినప్పుడు భోజనం పెట్టి వాళ్ళ దగ్గర  వారు ఎంత ఇస్తే అంత డబ్బు తీసుకొని తాను సుఖమయ జీవితాన్ని గడుపుతూ ఉండేది  అలాంటి  స్త్రీల వంట వడ్డన  వారి ఆప్యాయత తల్లిని మించిన  ఆనందం కలగజేసే పద్ధతి  మన కళ్ళకు కట్టినట్లుగా  ఆ పుస్తకంలో  చక్కటి ఉదాహరణలతో రాశారు  ఏనుగుల వారు.


కామెంట్‌లు