కొత్త పుస్తకం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఇవాళ చిన్నపిల్లల నుంచి ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ చూడడానికి అలవాటు పడ్డవారే.  ఆ ఇంటర్నెట్ బ్రౌజింగ్ పెద్ద  అవరోధం ప్రపంచంలో అన్ని విషయాలను ఫోటోలను ఆకర్షణంగా చూపించే ఇంటర్నెట్ ముందు ఓపిగ్గా చదవాల్సిన పుస్తకం వెల వెల పోతుంది  పుస్తకాన్ని చదివేటప్పుడు ఏ రకంగా చదవాలి లేకుంటే ఆ రచయిత ఏం చెప్పదలుచుకున్నాడో అది మీకు అర్థం కాదు అక్కడ ఇంటర్నెట్లో మీ మెదడు ఆలోచించవలసిన అవసరం ఏమీ ఉండదు. దానిని అలా చూడగానే ఇట్టే పసి కట్టగలవు  నీ అంతట నీవే ఒక కథను అల్లి దానిని ఇతరులకు చెప్పడానికే కానీ చదవటం అలా కుదరదు నీవు ఎప్పుడు మనసును ఏకాగ్రం చేయాలని అనుకున్నావో అప్పుడు మాత్రమే పుస్తకాన్ని తెరువు  ఒక పేజీకి నాలుగు పేజీలు చదువు అర్థమవుతుంది  అంతేగాని ఆబతో ఎక్కువగా చదవాలి అనుకున్నట్లయితే అది కుదరదు. ఇవాళ ఆడియో బుక్స్ అన్న పేరుతో  అనేకమంది తమకంఠంతో చదివి దానిని రికార్డు చేసి  వీడియో కాకుండా ఆడియో ఒక మాట మాత్రమే వినిపిస్తూ ఉంటుంది  మీ వయసులో ఉన్న కురవాళ్ళు వాటికి బాగా అలవాటు పడ్డారు  అది వింటే  వారి వాక్యాన్ని మీరు దృశ్యం లో  ఊహించుకోవచ్చు  ఆ దృశ్యాన్ని ఊహించినప్పుడు మీకు అనేక రకాల ఆలోచనలు  సృజనాత్మకత పెరుగుతుంది  అలా చేయడంవల్ల మనం ఇతర పనులు చేసుకోవడానికి కూడా ఏమీ ఉండవు  ఆ కథను వింటూ  ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏ పని అయినా మీరు చేయడానికి  ఇది అడ్డంకి కాదు  ఆ కథ అయిన తర్వాత ఆ పుస్తకం చదవాలని కోరిక ఆసక్తి మీలో ఉద్భవిస్తే  అప్పుడు మరో పుస్తకం కొని కానీ ఇతరుల దగ్గర తీసుకుని కానీ  మీరు చదవడానికి ఆసక్తి చూపుతారు అలా చేసి చూడండి. పుస్తకం చదివిన తర్వాత  ఆ కథ ఏమిటో మీకు తెలుస్తుంది  అంత మాత్రం చేత సరిపోదు  ఏ కథను మీరు విన్నారో ఆ కథని ఇతరులకు చెప్పడం ద్వారా  మీ మనసును విస్తృతం చేసుకోవచ్చు  ఇతరులతో ఆ కథ చెప్పడానికి మీరు ఉపక్రమించినప్పుడు వారు ప్రశ్నలు వేయక తప్పదు దానికి సమాధానాలు మీరు చెప్పే తీరాలి  అలా జరగడం వల్ల నీలో సృజన  క్రియేటివిటీ  ఆ పాత్రల యొక్క మానసిక స్థితి ఏమిటి  ఆ స్థితికి అనుగుణంగానే  భౌతిక లక్షణాలను చేర్చి ఆ పాత్రను తీర్చిదిద్దారా రచయిత లేదా అన్న విషయాన్ని  నీ స్నేహితులతో చర్చిస్తూ ఉంటే  నీవు నీ స్నేహితుడు కూడా తప్పకుండా లబ్ధి పొందుతారు.


కామెంట్‌లు