అమ్మ నాన్న రాము; - కె. ఉష శ్రీ 9వ తరగతి

 అనగనగా ఒక ఊరిలో సోమయ్య యాదమ్మ భార్య భర్తలు ఉండేవారు.వాళ్లకు ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు పేరు రాము వాళ్ళ కొడుకుని బాగా చదివించి డాక్టర్ కావాలని  వాళ్ల తల్లిదండ్రుల కోరిక వాళ్ల అమ్మానాన్నలు కూలీ పనికి వెళ్లి వాళ్ల కొడుకును చదివిస్తున్నారు. ఒకరోజు వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగాలేదు ఆ రోజు రాము బడికి వెళ్ల లేదు.వాళ్ళ అమ్మతో పాటు అతడు కూడా కూలీ పనికి వెళ్లాడు. కొన్ని రోజులకు వాళ్ళ నాన్న ఆరోగ్యం కుదుట పడింది ఆ రోజు నుండి రాము ప్రతిరోజు బడికి వెళ్తున్నాడు. అతడు బాగా చదువుకొని డాక్టర్ అయ్యాడు వాళ్ల అమ్మానాన్నల కోరిక నెరవేర్చాడు రాము తల్లిదండ్రులను కష్టపెట్టకుండా సంతోషంగా చూసుకుంటున్నాడు. బాగా చదివి అమ్మానాన్నల కోరిక రాము తీర్చాడు. కష్టపడి చదివితే ఫలితం తన దరికి చేరుతుంది.
నీతి    కష్టేఫలి ఏదైనా కష్టపడితే విజయం దానంతంట అదే మన దరికి చేరుతుంది అర్థం.
కామెంట్‌లు