చిన్నయ్య చిన్న రైతు.రెండు ఎకరాల పొలంలో నేల తల్లిని నమ్ముకుని వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకుని బ్రతుకుని వెళ్లదీస్తున్నాడు.అతనికి ఇద్దరు పిల్లలు. ఓ అబ్బాయి,ఓ అమ్మాయి.ఇద్దరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నాడు.
సంవత్సరాలు గడుస్తున్నా లాభాలు చవి చూసిన పాపాన పోలేదు.అప్పుల ఊబిలో కూలిపోయాడు.ప్రతి సంవత్సరం ఏదో ఒక ఆపద, వర్షం పడకపోవడం,నాణ్యతలేని విత్తనాలు తెలియక నాటడం,ప్రక్క వాళ్ళ మాటలు నమ్మటము,వరదో తుఫానో పిలువని అతిధులుగా వచ్చి చేతికి అంది వచ్చిన బిడ్డలను మత్యువు పట్టుకుని వెళ్ళినట్టు పంటను లాక్కెళ్ళిపోవడం జరుగుతోంది.బేలతనంతో బెంబేలు పడిపోవడం మాములు ఐపోయింది.
భార్య రాఘవమ్మ ధైర్యం చెప్పటంతో మళ్ళీ ఆ కష్టానికి అలవాటు పడటం జరుగుతోంది.
కష్టం తర్వాత సుఖం ఇస్తాడు అంటారే దేవుడు.తనని మాత్రం ఇలా చిన్నచూపు ఎందుకు చూస్తున్నాడని భగవంతుని ప్రశ్నించని రోజు లేదు. అయినా సమాధానం లేదు.
షిరిడి సాయిబాబా అన్నట్లు శ్రద్ధ, సబూరి మాటలు నేపధ్యంలో మనసు వల్లివేసేది.
కష్టాలన్నీ ఎవరో మంత్రం వేసి మాయం చేసినట్లు ఒక విచిత్రం జరిగింది అతని జీవితంలో.
విసిగి వేసరిపోయిన అతను తన ఇష్టమైన పంటను చివరిసారి అన్నట్లు వేశాడు.ఎంత రైతైనా మనిషేగా!
అతనిని ఆదుకునే వాళ్లే ఉండరు. దళారీల దగ్గర్నుంచి అందరూ మోసం చేసే వాళ్లే.
ఇన్నాళ్ళూ ఉన్నావా అని ప్రశ్నిస్తున్న భగవంతుడు ఒక్కసారి సమాధానం చెప్పినట్లు ఒక్కరోజులో అతను కోటీశ్వరుడు అయిపోయాడు. అతను ఇన్నాళ్ళ కోరికలన్ని తీర్చుకోగలిగాడు.అది టమోటా ఇచ్చిన వరమని ఈపాటికి మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది గా.
సమాప్తం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి