ఆధ్యాత్మికం;- మమత ఐలకరీంనగర్9247593432
 అంశం:-ధర్మాధర్మ యుద్ధం
=====================
క.
వీరోచిత పోరాటము
భారతమును గాంచదెలియు బహువిధములుగన్
నేరుగ బ్రతుకక నేలను
దారుణముగ నాక్రమించ ధర్మమ మనసా!
క.
పురుషోత్తంబుండైనను
తరగున రానీయబోడు తన దామముకున్
గరిమకు తగ్గని పుణ్యము
నెరవేరగ యడుగుబెట్ట నేలను జూపున్
తే.గీ
న్యాయ ధర్మాల చరితలే ధ్యేయమవగ
నేలకెవరైన నొరిగేరు నిక్క ముగను
మరణ మొందంగ నక్కర ధరణి గాదె
జన్మమెత్తేది నేలపై సఫలమొంద

కామెంట్‌లు