ఆధ్యాత్మికమణిపూసలు;;- మమత ఐలకరీంనగర్9247593432
గజేంద్ర మోక్షం (28 నుండి 33)
-------------------------------------
కలియ దిరిగె కొలనంత
చేసెను గారడి వింత
ముందు వెనుకచూడక 
కలుషితమయె నీరంత

అదుపు తప్పి గజేంద్రము
ఆడుచున్న నయగారము
కనిపెట్టుచు నుండెనంత
కొలనందలొక్క మకరము 

గజేంద్రుని రజో గుణము
హెచ్చించిన వినోదము
మలుపు దిప్పజూసి మొసలి
పట్టెను కాలు శీఘ్రము

తిరగబడెను జాతకము
జలమున మొసలికి బలము
పట్టిన పట్టును విడదు
చిక్కుక పోయెనుగజము

పెనుగులాట షురవాయెను
యుద్దమింక మొదలాయెను
గజబలమ్ము చూపించగ
మొసలిబలము హెచ్చించెను

వరుణ దేవుని సరస్సు
ఒంపుసొంపుల సొగస్సు
కొలను పేరు ఋషి మంతం
ప్రవాహమెంతొ ఉషస్సు


కామెంట్‌లు