ఆధ్యాత్మికమణిపూసలు;- మమత ఐలకరీంనగర్9247593432
గజేంద్ర మోక్షం (39 నుండి45 )
=======================
ఎత్తు పది యోజనములు
పొడవు పది యోజనములు
వెడల్పు నందులో గూడ
నుండె పది యోజనములు  (10 నుండి 15 కి.మీ)

త్రికూట పర్వతము చుట్టు
పాలసంద్ర అలల పట్టు
నురగలు గ్రక్కుచు నుండెడి
ధ్వని చప్పుడె కనికట్టు

చిన్న చిన్న గుహలందున
సిద్ధులు యోగులు నిండిన
పద్దతిగల పర్వతమట
విద్యాధరులచె ఘనమున

అప్సరసలు గంధర్వులు
కిన్నెరలును  కింపురుషులు
సేదతీర గుహలందున
ఇంకెన్నో శిబిరంబులు

ఆటల పాటల తోటలు
ఋషి నివాసపాశ్రమాలు
అద్భుతాల కూటమిన
పక్షుల కిలకిల రవములు

ఎవరి విధులు వారివి
స్వచ్ఛమైన పనులవి
కొండపైన భీకరుండు
గజేంద్రునిదే అడవి

కొండకు మించిన వాడు
దండిగ బ్రతికే వాడు
వెండి గుణము సోకెనో
మకరముకు జిక్కినాడు


కామెంట్‌లు