గజేంద్రమోక్షం(46 నుండి 50)
-------------------------------------
మకరమేమొ జలము నందు
గజమేమో పుడమి నందు
వీరికి వైరంబెట్లని
అడుగుచున్న ఆత్రమందు
బలగంతో నడకలాయె
ఎండలపుడు అధికమాయె
ఆటలతో విహరించగ
అధికంగా దప్పికాయె
నీటి కొరకు పరుగు లాయె
కొలను దొరుక చింత పోయె
సతి సంతతి బలగాలు
ముందు స్నానమాడబోయె
వారి పిదప గజరాజము
దప్పిక స్నానాంతరము
చిందులు ద్రొక్కెడి కథలకు
ఆగ్రహించెననె మకరము
పరీక్షిత్తు మహారాజు
కోరెను హెచ్చగ రివాజు
శుకమహర్షి బోధనలో
తెలిసె ధర్మముల తరాజు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి