హరివిల్లు రచనలు,-కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864
 హరివిల్లు 66
🦚🦚🦚🦚
గడిచిన కాలగతి నుండి
*అనుభవము* నింపుకొనుము..!
*ముందు చూపులతో* మంచి
జరుగునని నమ్ముకొనుము.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 67
🦚🦚🦚🦚
*జాగరూకతలేకున్నచో* 
అలజడుల అలలు వచ్చి
కసిగా *పాద స్పర్శలు*......!
అదఃపాతాళ చోటుకు
లాగే *ఖేద స్పర్శలు*..........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 68
🦚🦚🦚🦚
ఇష్టపడుచు కష్టపడిన 
*నింపాది సంపాదనలు*.........!
అంచెలంచెలుగ పెరిగిన
*అవిరళకృషి* సాక్ష్యాలు.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 69
🦚🦚🦚🦚
సమయ సద్వినియోగ
విధి విధానం! *నేర్చుకో.*.....!
ఏదేమైనను కాలము
ఆగదు కదా! *తెలుసుకో*.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 70
🦚🦚🦚🦚
*కోట్ల చెట్లను* నరకక 
తుది వరకు *పెంచండి*......!
పుంఖానుపుంఖలముగ
*ప్రాణవాయువొచ్చునండి*.....!!
                    ‌(ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు