హరివిల్లు రచనలు,;- కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్-9440522864.
 హరివిల్లు 91
🦚🦚🦚🦚
ఊక దంపిన,  ఊరి
జనుల *కేమి యొనగూరును*...!
నూక లిచ్చిన గాని 
జనులకు *ఆకలి తీరును*........!!
 🦚🦚🦚🦚
హరివిల్లు 92
🦚🦚🦚🦚
సహజ స్థితిని కోల్పోక
నిలవడుట *మనో ధైర్యం*...!
కష్ట సుఖాలలో నిండు 
కుండలా  *గాంభీర్యం*..........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 93
🦚🦚🦚🦚
ఆఖరి శ్వాస ఆగే 
వరకు పరుల హితము కోరు...!
తుది శ్వాస విడుచు వరకు
మోక్ష సన్నిధిని  కోరు.............!!
 🦚🦚🦚🦚
హరివిల్లు 94.
🦚🦚🦚🦚
అవినీతితో అభివృద్ధి
గతి తప్పి పతన *హేతువు*....!
నిజాయితీతో సమృద్ధి
జాతీయత గల *క్రతువు*.........!!
 🦚🦚🦚🦚
హరివిల్లు 95.
🦚🦚🦚🦚
కస్సు బుస్సు లాడి డస్సి
పోయి *వగచుట మానవలె*...!
ఉష్ణ తాపమునకు *కృష్ణ* 
*నామ స్మరణ* చేయవలె........!!
                      ( ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు