హరివిల్లు రచనలు,;- కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,9440522864.
 హరివిల్లు 101
🦚🦚🦚🦚
కొరతలు ఎక్కువైనను
మమతలు తగ్గరాదు.........!
భవంతుల ఎర చూపినను
వదంతులు నమ్మరాదు.......!!
 
🦚🦚🦚🦚
హరివిల్లు 102
🦚🦚🦚🦚
అనయము నిను గొలుచు నటుల
ఘనముగ నను గని మలచుము.!
నిను పిలిచి పిలిచి తలచుచు
మనమున నిలిపెద సతతము....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 103
🦚🦚🦚🦚
వాస్తవాలు కప్పిపుచ్చు
కపట పటాటోపాలు.......!
పునరావృత శైలిలో
మరల అవినీతి వరాలు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 104
🦚🦚🦚🦚
చెడు వారితో కలిస్తే
అసలుకే ఎసరట........!
గొడ్డలికి ఊతమై తన
చెట్లనే నరికిందట.......!!
 🦚🦚🦚🦚
హరివిల్లు 105
🦚🦚🦚🦚
భక్తిగ కొలుచు వారలకు
ముక్తికి దారిచ్చువాడు....!
హాని చేయు వ్యక్తులకు
హాయినివ్వని వాడు.......!!
                    (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు