హరివిల్లు రచనలు,;- కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్. - 9440522864.
 హరివిల్లు 106
🦚🦚🦚🦚
తెలుగును మరువక మనమున
నిలుపుట! *కావలదు రోత*....!
తెలుగు భాష మనుగడకై
పరిశ్రమించుట! *బాధ్యత*.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 107
🦚🦚🦚🦚
ఎడారిలో నడయాడిన
అడుగుల ఆనవాళ్లు.....!
సమయోచిత రీతిలో 
ఎదుర్కొనిన సవాళ్ళు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 108
🦚🦚🦚🦚
మేలును మరిచి పోరుకు
సిద్ధమైన *కృతఘ్నత*..........!
మేలునకు విధేయుడవై 
మేల్కొనిన *కృతజ్ఞత*.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 109
🦚🦚🦚🦚
మనసులో తిష్ట వేసిన 
చెడు భావనే *అపకారి*......!
ఇనుమును ఆవహించిన
తుప్పే *వినాశన కారి*..........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 110
🦚🦚🦚🦚
వేల కోట్లార్జించినా
విలువ లేని అసత్యాలు.......!
వేల ఏళ్ళు గడిచినా
విలువ తగ్గని సత్యాలు.......!!
                        (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు