హరివిల్లు రచనలు,కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,9440522864
 హరివిల్లు 111
🦚🦚🦚🦚
కొరతలు ఎక్కువైనను
మమతలు  తగ్గరాదు.........!
భవంతుల ఎర చూపినను
వదంతులు నమ్మరాదు.......!!

🦚🦚🦚🦚
హరివిల్లు 112
🦚🦚🦚🦚
అనయము నిను గొలుచు నటుల
ఘనముగ  నను గని మలచుము.!
నిను పిలిచి పిలిచి తలచుచు
మనమున నిలిపెద సతతము....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 113
🦚🦚🦚🦚
వాస్తవాలు కప్పిపుచ్చు
కపట పటాటోపాలు.......!
పునరావృత శైలిలో
మరల అవినీతి వరాలు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 114
🦚🦚🦚🦚
చెడు వారితో కలిస్తే
అసలుకే ఎసరట........!
గొడ్డలికి ఊతమై తన
చెట్లనే నరికిందట.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 115
🦚🦚🦚🦚
భక్తిగ కొలుచు వారలకు
ముక్తికి  దారిచ్చువాడు....!
హాని చేయు వ్యక్తులకు
హాయినివ్వని వాడు.......!!
                       (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు