హరివిల్లు రచనలు,; కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864

 హరివిల్లు 126
🦚🦚🦚🦚 
మనసును కఠినము చేసి
ఉబికి పైకి వచ్చు!  *అలక*......!
గట్టి మట్టిని ఛేదించి
అంకురించి వచ్చు!  *మొలక*....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 127
🦚🦚🦚🦚 
అలుపెరుగని పయనంలో
పలకరింపు లెన్నెన్నో............!
ధ్యాసెరుగని శయనంలో
కలవరింపు లెన్నెన్నో........!
🦚🦚🦚🦚
హరివిల్లు 128
🦚🦚🦚🦚 
భూమి, చంద్రుడి మధ్యన
నిడివి పెరుగుతుందట......!
భావి తరాల వారికిక
నెల నెల వెన్నెల కరువట....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 129
🦚🦚🦚🦚 
*పరిమితిని* *మించిన* *ధ్వని*
*తరంగాలు* *చెడు చేయును*..!
*వినికిడి* *శక్తి* *కొరవడి*
*గుండెపోటులెక్కువగును*......!!
 
🦚🦚🦚🦚
హరివిల్లు 130
🦚🦚🦚🦚 
కొంత లాభం కూడా 
దక్కని *పంట నష్టం*....!
ఎండల్లో చెమటోడ్చి
చేసిన *కాయ కష్టం*.......!!
 
            (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు