హరివిల్లు రచనలు,కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్- 9440522864 .
హరివిల్లు 51
🦚🦚🦚🦚
గత జన్మలోని పాప
పుణ్య ఫలితం! విధిరాత.....!
గతానుభవపు మోతతో
సరియగు నడక! ఎదురీత.......!!
🦚🦚🦚🦚
హరివిల్ల 52
🦚🦚🦚🦚
కలుగున దాగిన దొంగలు 
వస్తారు వెలుగులోకి .........!
ద్విసహస్ర నల్ల ధనపు
కట్టల వేగ మార్పిడికి...........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 53
🦚🦚🦚🦚
పాపపు పనులకు
ఉద్దీపన! *కోపం*.......!
అగ్నికాజ్యంలా చిత్త 
విచ్ఛిన్నత *ప్రకోపం*........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 54
🦚🦚🦚🦚
*తినక తినక - తిని తిని*
*తినక తినక* నకనకలకు 

తికమకయై *నీరసించి*..........!
*తిని తిని* ఆయాస పడుచు
పొర్లితిని! *అతిగ భుజించి*...!!
 🦚🦚🦚🦚
హరివిల్లు 55
🦚🦚🦚🦚
మితి మీరి వేయు ఎరువుల
మోత ! *నేల నిస్సారం*.......!
అదుపు తప్పిన ఖర్చుల
సంస్థానం! *ఋణ భారం*........!!
                     (ఇంకా ఉన్నాయి).
కామెంట్‌లు