హరివిల్లు రచనలు,;-కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,- 9440522864.
 హరివిల్లు 56
🦚🦚🦚🦚
పరుల సహనాలను వారి 
బలహీనతలు అనుకోకు.....!
హవనగుండ ప్రజ్వలాగ్ని 
వారి రక్షణ! మరువకు........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 57
🦚🦚🦚🦚
చెప్పే వారిని బట్టి 
తప్పొప్పుల మిశ్రమాలు.....!
వినే వారిని బట్టి 
విచక్షణల అంగీకారాలు.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 58
🦚🦚🦚🦚
సంతోషమెల్ల వేళల
నిలువదు శాశ్వతముగా ....!
మనసున తృప్తి యున్న
సంతసమది కానుకగా........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 59
🦚🦚🦚🦚
కోల్పోయిన సమయం 
తిరిగిరాదని తెలుసుకో.....!
మేల్కొని గొప్ప కాలాన్ని
సద్వినియోగపరచుకో......!!
 🦚🦚🦚🦚
హరివిల్లు 60
🦚🦚🦚🦚
జన్మ నిచ్చి పోషించిన
వారిని *మరువకు* విడువక....!
జననీ జనుకులకు 
చేయుము *సేవలు* తప్పక....!!
                      (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు