హరివిల్లు రచనలు,కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్-9440522864
 హరివిల్లు 61
🦚🦚🦚🦚
అధికారి అహంకారం
వెటకారపు తాత్సారం......!
అధికారి సహకారం
పని వేగపు శ్రీకారం...........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 62
🦚🦚🦚🦚
తెలుగు మాట లందు
తేనె లొలికించవచ్చు.....!
పద్య గద్య హృద్య మందు
పరిమళాలు నింపవచ్చు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 63
🦚🦚🦚🦚
భారమనిపించినంతనె
వెనుకడుగులు వేయొద్దు.....!
బాధ్యతలను గుర్తెరిగి
ముందడుగులు మానొద్దు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 64
🦚🦚🦚🦚
పనులు చేయకున్న
నా మనసు నారాజు....! 
పనులు సకాలమున
చేసిన నే రారాజు.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 65
🦚🦚🦚🦚
శక్తికి మించి, రక్తితో
ఆలోచన చేయవలదు.....!
గంపెడాశల

మనసుతో
గాలి మేడ కట్టవలదు......!!
                (ఇంకా ఉన్నాయి)
కామెంట్‌లు