సంఘజీవి...;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మానవుడు సంఘజీవి అని చెప్తాం  అది ఎంతవరకు నిజం  సంఘాల్లో ప్రతి ఒక్కరితోనూ అన్నదమ్ముల్లాగా కలిసి ఒక కుటుంబ సభ్యులు లాగా ఉండవలసిన పరిస్థితి  కానీ ఇవాళ స్థితి అలా ఉన్నదా  నిజంగా అలా ఉంటే  ఇవాళ ఒకరిపై ఒకరికి కోపాలు తాపాలు  ఒకరంటే మరొకరికి పడకపోవడం  మాటకు మాట బదులు చెప్పి తగాదాల వరకు రావడం  స్త్రీల వల్ల వచ్చే అనేక రకాల తగాదాలతో  చివరకు ప్రాణాలను  తీసే వరకు వచ్చే పరిస్థితులను మనం చూస్తున్నాం  మరి కుటుంబంలో అలా జరుగుతుందా  ఇలాంటివి ఏవైనా వచ్చినప్పుడు తల్లి కానీ తండ్రి కానీ లేదా ఇంటి  పెద్ద అన్న కానీ  ఇద్దరినీ కూర్చోబెట్టి సమన్వయపరిచి  వారిద్దరి మధ్య  ఎలాంటి కోపతాపాలు లేకుండా చూడడం ఆయన కర్తవ్యం గా భావించి అలా చేస్తారు.
మానవులలో ఎవరికైనా మూడు గుణాలు  ఉంటాయి  సాత్వికంగా ఉండేవారు కొందరు ఉంటారు  కావాలని తగాదాలను సృష్టించి దానిలో  ఇబ్బంది పడే మనుషులు కొంతమంది ఉంటారు  తన పని తాను చేసుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా  ఎవరైనా తన మీదకు వస్తే ఏమాత్రం సహించని  వ్యక్తులను రాజస ప్రవృత్తి కలిగిన వారు అని పిలుస్తాం  సహజంగా ఉన్నటువంటి ఈ గుణాలు ఎప్పుడో ఒకసారి పరిస్థితుల ప్రభావం వల్ల కానీ  తనకు ఎదురైన సంఘటనల వల్ల కానీ  కోపం రావడం కానీ  ఉద్రేకంతో చేయరాని పనులు చేసే స్థితి కానీ కలగవచ్చు  కనుక అలాంటి వాటి జోలికి వెళ్లకుండా  సాత్విక ప్రవృత్తితో జీవించడం వ్యక్తికి మంచిది అని చెప్పడం కోసం ఈ పద్యాన్ని మనకు తెలియజేశారు వేమన. ఎదుటివారి మీద బాగా పెంచుకోవడానికి కారణం  క్షణంలో వచ్చే కోపం  దానిని అధినములో ఉంచుకున్నట్లయితే  పగ దానంతట అదే సమస్య సమసి పోతుంది. ఆ పగ ఎప్పుడైతే తగ్గిందో కోరికలు కూడా వాడిని చంపాలి, నరకాలి వాటిని చిత్రహింసలు చేయాలి అన్న ఆలోచనలో అన్నీ దూరంగా వెళ్లిపోతాయి  ఎప్పుడు అరిషడ్వర్గాలను జయించి నీ మనసును నీ అధీనంలో ఉంచుకున్నావో అప్పుడు మోక్షం పైన మనసు మళ్లుతుంది  అప్పుడు తదేక దృష్టితో ఏ దైవాన్ని ఇష్టంగా కొలుస్తావో ఆ దైవం పై  మనసును నిలిపి  ధ్యానానికి వెళ్లిపోతే  నీకు తప్పకుండా మోక్షం ప్రాప్తిస్తుంది అని చెప్తున్నాడు వేమన  వారు రాసిన పద్యాన్ని చదవండి విషయం అర్థం అవుతుంది.

"పగ యుడుగు కోపయుడిగిన  పగయుడుగున్ గోర్కు లుడుగు  పరి జన్మంబుల్  తగులుడుగు భేదముడిగిన త్రిగుణములుడుగంగ ముక్తి స్థిరమగు వేమ..."  



కామెంట్‌లు