మా గ్రామానికి మంచి పేరు తెచ్చిన వారిలో చెప్పుకోదగిన వ్యక్తి మా నాన్న సుబ్బారెడ్డి గారి శిష్యుడు బొమ్మా రెడ్డి అన్న పేరుతో ఉన్న బొమ్మా రెడ్డి వెంకటేశ్వర రెడ్డి పుచ్చలపల్లి వారు వచ్చినప్పటి నుంచి వామపక్ష సిద్ధాంతాలకు అంకితమై విజయవాడ వెళ్లి అక్కడ కొంతమంది మిత్రులతో కలిసి విశాలాంధ్ర పత్రికను స్థాపించి దానికి సంపాదకత్వం కూడా వహించినవాడు తర్వాత పార్టీలో చీలికలు వచ్చి రెండుగా విడిపోయినప్పుడు ప్రత్యేకంగా ప్రజాశక్తిని ఏర్పాటు చేసి దానికి సంపాదకుడిగా వ్యవహరించాడు ఆయన జీవితమంతా ఆదర్శాలతోనే కూరుకున్నది చెప్పిన మాట తప్పడు ఏ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడో దానిని తప్పకుండా అనుసరిస్తాడు. ఒక సందర్భంలో మా ఉన్నత పాఠశాల కార్యక్రమానికి వచ్చి వారి ఉపన్యాసం ఇచ్చిన తరువాత నేను మామయ్య అని పిలుస్తాను నన్ను ఏరా బ్రహ్మం అనే పిలుస్తారు అంత సన్నిహిత సంబంధం మా మధ్య ఉంది ఆరోజున ఇష్టా గోష్టిగా నేను మాట్లాడుతున్న సందర్భంగా మీరంతా యువకులు ముందు ప్రశ్నించడం నేర్చుకోండి ఎలాంటి సందేహాలను మనసులో దాచుకోవద్దు నిర్భయంగా బ్రతకడం నేర్చుకోండి అని చెప్పినప్పుడు అలా ప్రశ్నించడం వల్ల మనకు ఒరిగేది ఏమిటి అని నా అమాయకపు ప్రశ్న అవతల ఏ విషయాలు చెప్తున్నారు దాని నిగ్గు తేల్చడానికి నీ ప్రశ్నలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి లేకుంటే అది తప్పు నిర్ణయం అని నిర్ణయించుకుంటారు అన్నారు. మా నాన్న ఎన్నో ఆదర్శాలను చెప్పినవాడు నా వివాహ విషయంలో కూడా నాకు చెప్పమని బొమ్మారెడ్డిని పంపితే వారు వచ్చి ఒక జీవితాన్ని సరి అయిన మార్గంలో పెట్టిన వాడవు అవుతావు మీ నాన్న చెప్పే ఆశయాలకు నీవు ఆదర్శప్రాయంగా నిలుస్తాం నీలాంటి యువత అభ్యుదయ భావాలతో ముందుకు వెళ్లకపోతే సమాజం ఎంతో వెనుకబడిపోతుంది నీవు చేసే ఈ మహత్తర కార్యం ఎంతోమంది యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది పేరు కోసం కాదు అమాయకురాలైన ఏ తప్పు చేయకుండా శిక్షను అనుభవిస్తున్న బాలకు ఆదర్శంగా నిలుస్తావ్ అనగానే నాకేమీ అభ్యంతరం లేదు అయితే నేను నా కుటుంబంలో ఏ రకమైన ఆస్తిని భాగంగా తీసుకోదల్చుకోలేదు నా కాళ్ళపై నేను నిలబడి ఉద్యోగం రాగానే మీరు చెప్పిన పని చేస్తాను అని హామీ ఇచ్చి అలాగే చేశాను ఇలాంటి కార్యాలు ఎన్నో చేసినవాడు మా మామయ్య బొమ్మా రెడ్డి గారు.
మన గన్నవరం;-ఏ.బి ఆనంద్, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం, 9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి