కోతి చేష్ట;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా మంచి పని చేయాలి అని అనుకుంటే  పని విభజన చేసి దానిని  పద్ధతి ప్రకారం  ఏర్పాటు చేసుకుంటే అది తప్పక విజయాన్ని పొందుతుంది  అని ఆర్థిక శాస్త్రవేత్తలు చెబుతారు ఈ జగతి మొత్తాన్ని నడిపించాలి అని  అనుకుంటే  అసలు ఈ జగత్తును సృష్టించింది బ్రహ్మ అని  ఆయన సృష్టించిన జీవజాలాన్ని  పెంచి పోషించేది  విష్ణువు అని  ప్రణాళికాబద్ధమైన జీవనాన్ని గడపడానికి  అన్ని ఒనరులను కలిగించేది శివుడు అని మనవారు తెలియజేస్తారు ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండాలంటే  ముందు వారు ఆదర్శంగా ఉండాలి  బ్రహ్మ  స్త్రీని గౌరవించాలి  అని ప్రపంచానికి తెలియచేశాడు  అని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి  కనుక తన భార్య సరస్వతి దేవిని  తన నోటిలోనే ఉంచుకున్నాడు అంటే నోటిని  నీ అదుపులో ఉంచుకున్నట్లయితే ఎలాంటి  విపత్తులు రావు అని చెప్పడం  అలాగే విష్ణుమూర్తి  తన భార్య లక్ష్మీదేవిని  గుండెల పై భద్రపరుచుకున్నాడు  అంటే  మీ హృదయాన్ని  పవిత్రంగా ఉంచుకున్నట్లయితే  అరిషెడ్ వర్గాలను  జయించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పడం ఎప్పుడు నీ ఆరుగురు విరోధులను జయించావో  మోక్షానికి అర్హుడవు కాగలవు  అని తెలియజేయడం కోసం ఆ పని  శంకరుల వారి దగ్గరకు వచ్చేసరికి  తన భార్య  పార్వతి దేవిని  తన దేహంలో సగభాగంగా  ఏర్పాటు చేసుకున్నాడు  హక్కులైనా బాధ్యతలు అయినా ఇద్దరు కలిసి పంచుకోవాలి  కలిసే పని చేయాలి ఇద్దరిలో తరతమ భేదాలు ఉండడానికి వీలు లేదు  అని చెప్పడం కోసం ఆ ప్రయత్నం. ఈ ప్రపంచాన్ని అంతటిని  నడిపే బాధ్యత ఈశ్వరునికి అప్పచెప్పినప్పుడు  ప్రతి అణువులోనూ తాను ఉండి  ప్రకృతిలో ఎలాంటి  హెచ్చుతగ్గులు లేకుండా చూసుకుంటూ  మానవాళికి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు  అయితే ఆ పరమేశ్వరుని  మేము నడుపుతున్నాం అని బ్రాహ్మణులు చెప్పడం  అది అజ్ఞానమా విజ్ఞానమా  ఎంత ఆలోచించినా తెగని సమస్య  వేమన దానిని చక్కటి ఉపమానంతో  చెప్పాడు  ఒక కోతి వనంలో తిరుగుతూ దానికి కావలసిన పండ్లు ఫలాలు తింటూ కాలక్షేపం చేస్తూ  ఈ ప్రపంచం మొత్తాన్ని  నేనే పరిపాలిస్తున్నాను అని చెప్పితే ఎలా ఉంటుందో  ఆ విశ్వేశ్వరునిగురించి చెప్పే  బ్రాహ్మణుల పరిస్థితి అది అని చెబుతూ  చక్కటి పద్యాన్ని మనకు అందించాడు వేమన దాన్ని చదవండి.

"విశ్వమంత నడిపి విశ్వేశ్వరుండుండు  బ్రహ్మలకును నేల పాటి దక్కె వనములోని కోతి వసుమతి నడుపునా..."


కామెంట్‌లు