మన గన్నవరం- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 బొమ్మా రెడ్డి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వ్యక్తి  జీవితంలో ఎలాంటి  లోటు లేని  ఉన్నత కుటుంబంలో జన్మించినవాడు  ఆయన జీవితంలో ఏది వెతుక్కోవలసిన అవసరం లేకుండా  వారి తాతగారు అన్ని ఏర్పాటు చేసి వెళ్ళారు. చిన్నతనం నుంచి  చదువులో చాలా శ్రద్ధ వహించి  అప్పటికే మా గ్రామంలో ఉన్నత పాఠశాల లేకపోవడంతో  మా మేనమామ వజ్రాల సర్వారెడ్డి గారితో కలిసి ఇద్దరూ గన్నవరం రోజు వెళ్లి రావడం  ఎస్ ఎస్ ఎల్ సి వరకు చదివి  బాధ్యతాయుతంగా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై తేలప్రోలు గ్రామంలో మొదట ఉన్నత పాఠశాలలో చదువుకుంటూ చేసిన వారిగా ప్రసిద్ధి చెందారు  తర్వాత బీఏ వరకు చదివి  పవిత్రంగా తెల్లకాగితంగా తేలప్రోలు చేరారు. వేమన గ్రంథాలయంలో  మా నాన్నతో పాటు గుంటక పుల్లారెడ్డి లాంటి స్నేహితులతో చక్కటి చర్చా కార్యక్రమాలను నిర్వహించుకుంటూ  తమకున్న  జ్ఞానాన్ని పెంచుకుంటూ  గ్రంథాలయంలో ఉన్న చాలా పుస్తకాలను చదివి  గ్రంథ పరిచయంతో  తృప్తి చెందక  గ్రామీణ వాతావరణం కూడా  అధ్యయనం చేశారు  ఆ ప్రక్రియలో భాగంగా  మా నాన్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను పూసగుచ్చినట్లు వారికి చెప్పడం నాన్న చదివిన మార్క్స్ సిద్ధాంతాన్ని  భగవద్గీత తో  సమన్వయపరిచి  వ్యక్తి జీవితం ఎలా ఉండాలి అన్న విషయాన్ని గురించి కూలంకషంగా బొమ్మా రెడ్డి వారికి తెలియజేయడం దానితో ఆయన మనసు పత్రికా రంగం పైకి  మరలడం  తాను నేర్చుకున్న ప్రతి విషయాన్ని  నిరక్షరాస్యులైన సామాన్య ప్రజలకు తెలియజేయాలని  కంకణం కట్టుకున్నారు. ఆంధ్ర పత్రిక ద్వారా  అంకురించిన కాంగ్రెస్ అభిమానం కొద్దికాలంలోనే సోషల్ సిద్ధాంతర వైపు మొగ్గుచూపి జై ప్రకాష్ నారాయణ లాంటి నాయకుల ప్రభావానికి  లోనయ్యారు. ఆ సమయంలోనే  తన స్వగ్రామాన్ని విడిచి గన్నవరం తేలప్రోలు  గ్రామాలను తమ సొంత  గ్రామంగా భావించి  వారి సిద్ధాంతాలను  తెలియజేస్తున్న సందర్భంగా  బొమ్మా రెడ్డితో స్నేహం ఏర్పడింది. గ్రంథాలయంలో కూర్చున్నప్పుడు నాన్న ఒకసారి  సుందరయ్యా నువ్వు మార్క్స్ సిద్ధాంతాన్ని  చదివవా అన్నప్పుడు  లేదండి అని సమాధానం  ముందు ఆ పుస్తకం చదువు  తరువాత నీ సొంత అభిప్రాయాలను దానికి జోడించి  నిజమైన కమ్యూనిస్టు పార్టీ వ్యక్తి ఎలా జీవించాలో అలా జీవించడానికి  ప్రయత్నించు అని చెప్పిన తర్వాత  అక్కడ ఉన్న ఆ పుస్తకాలు తీసుకొని వారు చదివారు.

కామెంట్‌లు