నిద్ర విశిష్టత;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 నిద్ర ఆహారం అనేది మనిషికి నిత్యం అవసరమైనవి జీవించడానికి శరీరంలో శక్తి రావడానికి ముఖ్యమైనది ఆహారం అది లేకపోతే అనుక్షణం క్షీణిస్తూ ప్రాణాలను వదలవలసి వస్తుంది ఆరోగ్య రీత్యా ప్రతి మనిషికి  ఎనిమిది గంటలు పని చేయడానికి  ఎనిమిది గంటలు తన సొంత వ్యవహారాలు చూసుకోవడానికి మిగిలిన ఎనిమిది గంటలు నిద్రపోవడానికి ఏర్పాటు చేశారు  నిద్రకు ఉన్న ప్రత్యేకత మరి దేనికి లేదు  ఆహారం లేకపోయినా ఒకటి రెండు రోజులు  జీవించవచ్చు కానీ నిద్ర లేకుండా ఉండడం మానవునికి అసాధ్యం నిజంగా ఏదైనా పనిమీద ధ్యాస పెట్టి నిద్రను ప్రక్కన పెట్టి ప్రవర్తిస్తున్న మనిషి కూడా  సగం నిద్రలోనే ఉంటాడు అనేది మానసిక విశ్లేషకులు ఎప్పుడూ చెప్పుకున్న వాస్తవం.
రాత్రి నిద్ర పోయిన తర్వాత మానవ మస్తిష్కం ఎన్నో కలలతో నిండి ఉంటుంది మనిషికి వచ్చిన కల కలలలో కొన్ని గుర్తు ఉండవచ్చు గుర్తు లేకపోవచ్చు  కానీ అలా కనడం అనేది మెదడుకు నిత్యకృత్యం  నిజ జీవితంలో తీర్చుకోలేని అనేక కోరికలను  ఆ కలలో మానవుడు తీర్చుకుంటాడు  రాజభోగాలు అనుభవించినట్లు మహారాణి తన ప్రక్కన ముచ్చట్లు చెబుతున్నట్లు  తానే భారత దేశానికి రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నట్లు అందమైన విందు అందరూ ఇస్తున్నట్లు తలస్తూ శ్రీకృష్ణ పరమాత్మనే  అలాగా వ్యవహరిస్తున్నట్లు తనే అనేలా ఎన్నో ఎన్నెన్నో కలలు చెరిగిపోతూ ఉన్నా  అవి ప్రత్యక్షంగా జరుగుతున్న వాటి గానే ఆ క్షణాలను పొందుతూ ఉంటాడు  మెలకువ వచ్చిన మరుక్షణం  వాటిని తలుచుకుని నవ్వుకుంటాడు.
బ్రాంతిని కలుగజేసే  కలలను ఆ క్షణంలో ఎలా నమ్ముతూ ఉంటాము  జీవితంలో జరుగుతున్న ప్రతి పని  నిజమే అని అనుకుంటున్నాం  ఇది మాయ అన్న విషయం మన మనసుకు తట్టదు  ఒక మాయ అతని బంధుమిత్రులంతా మాయ కనిపిస్తున్న ప్రతిదీ మిథ్య  ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకుంటే  ముక్తిని పొందడానికి అవకాశం వస్తుంది అంటాడు వేమన  శంకరాచార్య లాంటి వారు అద్వైత సిద్ధాంతంలో చెప్పిన  మాయా పద్ధతి  దానిని సామాన్య మానవులకు కూడా తెలియడం కోసం తన పద్ధతిలో ఆటవెలది పద్యం ద్వారా తెలియజేస్తున్నాడు వేమన  వారు రాసిన పద్యాన్ని చదవండి విషయం  తెలుస్తోంది.

"సుప్తి జాగరముల సొలుపులతానుండి కప్పుకొన్న మాయ గానలేక దబ్బర నిజములను దాను లెస్స గనక గొబ్బున జెడిపోవు గుణము వేమ..."



కామెంట్‌లు