నిత్య సుఖము;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఈ భూమి మీద పడ్డ ప్రతి జీవి ఏ క్షణాన  తన భౌతిక శరీరాన్ని వదిలి వేస్తుందో దానికే తెలియదు  పుట్టిన ప్రతి జీవి  ఆ శరీరాన్ని ఈ భూమి మీద వదిలి వెళ్ళిపోవలసినదే అన్న నగ్న సత్యం ప్రతి ఒక్కరికి తెలుసు  శంకరాచార్యుల వారే చెప్పవలసిన అవసరం కూడా లేదు  అయితే  మానవ ప్రకృతి ఎలా ఉంటుంది అంటే  ఆశలమయం  ప్రతిదీ తన సొంతమే అనుకుని  దానిని ఎలా సంపాదించాలి  సంపాదించిన దానిని ఎలా  శాశ్వతం చేసుకోవాలి అని ఆలోచిస్తాడు తప్ప  నీవెంత ప్రయత్నించినా ప్రకృతిని జయించలేవు  ప్రకృతి ధర్మం ఏదైతే ఉన్నదో అది దాని ధర్మం  అది చేసుకుంటూనే పోతుంది  నీ ఆశలకు ఆకాంక్షలకు  అది బాధ్యత వహించదు  ఇది వేదాంతలు చెప్పే మాట  కానీ ఆ మాటలు మన చెవిటి చెవుకు ఎక్కవు. ఈ భూమి మీద నేను ఒక్కడినే కాదు కొన్ని వేల లక్షల కోట్ల మంది నివసిస్తున్నారు  సమాజంలో ఉన్నవాడు సమాజంతో పాటుతన ఉనికిని చాటుకోవాలి  మిగిలిన వారి కన్నా అందమైనది ఖరీదైనవి చూడడానికి ఆకర్షణగా ఉన్నవి  ధరించడం  మొదటి మెట్టు  ఆహార విషయంలో కూడా  తలన మించిన వారు లేరు అని చెప్పుకోవడానికి  తలకు మించిన పద్ధతులను అవలంబించడం  నీడను ఇచ్చే ఇంటిని  శుభ్రంగా ఉంచుకోవడం  ప్రతి ఒక్కరి బాధ్యత  ఇక్కడ చాలామంది తమ ఆధిక్యతను తెలియజేయడం కోసం ఎన్నో అలంకరణలు  ఎన్నెన్నో కళాఖండాలను  తీసుకువచ్చి  ప్రతి గదిలోను నాలుగు మూలల నాలుగు మంచి వాటిని ఉంచి  తన గొప్పతనం ఇది అని వచ్చిన వారికి చాటడం  అతని పద్ధతిగా కనిపిస్తుంది. ఈ అలంకరణలు అన్నీ  తనకు క్షణికానందాన్ని  అందిస్తాయి అన్న విషయం  అతని మనసుకు తట్టదు  నిత్యానందాన్ని పొందటానికి చేయవలసిన  అసలు పనులను మానుకొని  అనవసరమైన  వ్యాకులతను పెంచే  పనులపై మక్కువ పెంచుకుంటూ  జీవితంలో  ఎంతో నష్టపోతూ ఉంటాడు మనిషి  తన నిత్యావసరాలను తప్పకుండా  చేసుకుంటూ  ఈ శరీరం పతనమైన తరువాత కూడా శాశ్వతమైన ఆనందాన్ని పొందాలి అన్న ఆలోచన  మరణించేంతవరకు అతనికి రాదు  అలాంటి అహంకారాన్ని ఎప్పుడైతే  మనసు నుంచి దూరం చేస్తాము  అప్పుడు ఆనందమయమైన జీవితం  పరమాత్మ గురించిన  ఆలోచనతో  నిత్యం  మానసిక ఆనందాన్ని పొందవచ్చు  అన్న విషయం  తెలుస్తుంది  ప్రియమనవ రాసిన ఆ పద్యాన్ని చదవండి.

"నిత్యంబు కాని యొడలికి  నిత్యము దుఃఖముబడును  (నిరతము ధరలో) నిత్యానందపు పదవికి నిత్యంబును దుఃఖపడగ నేరరు వేమ..."



కామెంట్‌లు