మన గన్నవరం - ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ,9492811322.

 మా గ్రామ మాదిగ గూడెంలో ఉంటున్న  మేరీ అన్న అమ్మాయి చదువులో చాలా చురుగ్గా ఉంటుంది  ఒకటవ తరగతి నుంచి  ఎం ఏ వరకు  అన్ని ప్రథమ తరగతిలోనే  ఉత్తీర్ణురాలయింది  నేను ఆకాశవాణి  కేంద్రంలో పనిచేస్తున్నానని తెలిసి  ఒకరోజు నా వద్దకు వచ్చి తనను పరిచయం చేసుకొని  నేను పీహెచ్డీ చేయాలని అనుకుంటున్నాను  మీ సహకారం కావాలి  అని అడిగితే నాకు ఆశ్చర్యం వేసింది  అదేమిటి నేను చదివింది  బి.ఎ నాకు పీహెచ్డీ గురించిన  విషయాలు ఏమీ తెలియవు అని చెప్తే  అది కాదండి అంటూ  నేను మీ ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ ఉంటాను ప్రతిరోజు  ప్రత్యేకంగా మీరు ప్రసారం చేస్తున్న కార్మికుల కార్యక్రమంలో  నాటకాలు కానీ ప్రసంగాలు కానీ చర్చా కార్యక్రమాలు కానీ నన్ను బాగా ఆకర్షించినాయి. అందువలన ఆకాశవాణి కార్యక్రమాలు గురించి పీహెచ్డీ చేయాలని నా అభిలాష  మీరు ఇక్కడే పని చేస్తున్నారు కనుక ఇక్కడ విషయాలన్నీ మీకు కూలంకషంగా తెలిసి ఉంటాయన్న ఆశతో  మీ సహకారాన్ని పొందడానికి వచ్చాను  అని ఎంతో వినయంగా అడిగింది  ఆమె పద్ధతి నాకు బాగా నచ్చింది  ఇంతవరకు ఆ విషయాన్ని గురించి ఏ ఒక్కరు ఆలోచించలేదు  ఈమెకు  ఆ ఆలోచన వచ్చినందుకు ఎంతో ఆనందం  ముందు ఆకాశవాణి కేంద్రానికి తీసుకొని వెళ్లి  అక్కడ స్టూడియోలను చూయించి  కొంతమంది కళాకారులను  కార్యక్రమ నిర్వాహకులను  మా కేంద్ర సంచారకులు రజిని గారిని  ముందు పరిచయం చేశాను  ఆ తర్వాత రెండు మూడు రోజులు  కార్యక్రమాలు ప్రసారమయ్యే సమయంలో రమ్మన్నాను  చూడడం వల్ల కొంత అవగాహన పెరుగుతుందని నా అభిప్రాయం. తరువాత  ఉదయం వందేమాతరం నుంచి రాత్రి జైహింద్ వరకు జరిగే కార్యక్రమాల వివరాలు తెలియజేసి వాటిని ఎవరు నిర్వహిస్తున్నారు వాటికి  వారి పేర్లు చెప్పి ప్రత్యేకగా  కార్మికుల కార్యక్రమము నిర్వహిస్తున్న ఆమంచర్ల గోపాలరావు గారిని  వారు ఆ కార్యక్రమాన్ని  ఏ విధంగా నిర్వహిస్తున్నారు ఏ ఏ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దానిలో ఎవరెవరు పాల్గొంటూ ఉంటారో  అన్ని వివరాలను చెప్పాను  తనకు వచ్చిన అనుమానాలను  చాలా వరకు తీర్చాను  నేను చెప్పేటప్పుడే షార్ట్ హ్యాండ్ లో అన్ని విషయాలు చాలా స్పష్టంగా  రాసుకొని పీహెచ్డీ చేసి  ఆ పట్టా చేతికి వచ్చిన తర్వాత  తిరిగి వచ్చి నాకు కృతజ్ఞతలు చెప్పి వెళ్లిన సంస్కారి. మన మేరీ  ఆర్థికంగా ఎన్ని కష్టాలు పడినా వారి తల్లిదండ్రులు  ఆమె కృషికి దోహదం చేసినందుకు ముందు వారిని అభినందించాను.
కామెంట్‌లు