మన గన్నవరం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మా గ్రామం మేజర్ మైనర్ పంచాయతీలుగా విభజనకు ముందు  ఎంతో ప్రశాంతంగా ఉండేది గ్రామం  అప్పుడే కొత్తగా కమ్యూనిస్టు పార్టీ  గురించిన వార్తలు వస్తున్న సమయం  ఆ పార్టీని బలోపేతం చేయకుండా కాంగ్రెస్  పార్టీని బలపరుచుకోవాలన్న అభిప్రాయంతో  కాకాని వెంకటరత్నం గారి లాంటి  కాంగ్రెస్ పార్టీ నాయకులు మా గ్రామానికి వచ్చి  మా నాన్న సుబ్బారెడ్డిని  పెద్దమనిషిగా ఉంచి వింత వెంకటరెడ్డిని  మరి కొంతమందిని కలిసి  గ్రామ అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయాలను కూలంకషంగా చర్చించి  మనమంతా ఏకంగా  ఉంటే  గ్రామాన్ని ఉద్ధరించడం మన చేతులకు వస్తుంది  లేకుంటే కమ్యూనిస్టు పార్టీ వాళ్లు  సొంతం చేసుకుంటే గ్రామానికి నష్టం జరుగుతుంది అన్న విషయాన్ని  చర్చించుకున్నారు.
ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ  లో మంచి స్థానాన్ని సంపాదించి  తన మాటకు ఎంతో విలువతెచ్చుకున్న కాకాని వెంకటరత్నం గారు  ముందుండి పార్టీని నడిపించారు  గన్నవరం తాలూకా మొత్తం వారి అధీనంలో ఉండి  ప్రతి ఇంటికి వెళ్లి సిద్ధాంతాలను తెలియజేసి  పార్టీని బలోపేతం చేశారు  రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ  సమావేశాలకు  అర్హులుగా వింత వెంకటరెడ్డి గారిని ఎన్నిక చేసి  వారి మంచితనాన్ని గురించి  పార్టీకి ఆయన చేస్తున్న సేవలను గురించి పై వారికి చెప్పి  కాకాని వారే ఆ ఏర్పాటు చేశారు  అప్పటినుంచి ఆయన  అప్పటికి ప్రాచుర్యంలో ఉన్న  హిందూ పత్రికను చేతిలో పట్టుకుని  సభలకు వెళుతూ ఉండేవాడు  అయితే ఆయనకు ఏ బి సి డి లు కూడా రావు  పత్రిక  అలంకారప్రాయంగా ఉండేది  అంతే. వెంకట రెడ్డి గారు అంటే మా గ్రామంలో ఎవరికీ తెలియదు  మెంబర్ గారంటే అందరికీ తెలుసు  ఆయన తన కుమార్తెను  డాక్టర్  గోవింద రెడ్డి గారికి  ఇచ్చి వివాహం చేసి వారిని త్రేలప్రోలు పిలిపించి అక్కడ ఆసుపత్రిని కూడా కట్టించి  మంచి ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు  డాక్టర్ గారు కూడా  చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు వారి అమ్మాయి  ఝాన్సీ  మాకు జూనియర్  కారణాలు ఏమిటో  ఎందుకు అలా జరిగిందో గ్రామంలో ఏ ఒక్కరికి తెలియదు  అనుకోకుండా ఒక రోజు  డాక్టర్ గోవిందరెడ్డి  గారు మరణించారు అన్న వార్త  గ్రామం మొత్తం  తెలిసింది  ప్రతి ఒక్కరూ విషాదంలో మునిగిపోయారు  మంచి హస్తవాసి కలిగిన  వైద్యుడు లేని లోపం మా గ్రామానికి మిగిలింది.

కామెంట్‌లు