మన గన్నవరం;;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 మా గ్రామంతేలప్రోలులో నేను 5-6 తరగతి చదువుతున్న సమయంలో వింత వెంకటరెడ్డి పీహెచ్డీ చేసి  వరంగల్ లో లెక్చరర్ గా  పనిచేసి  తర్వాత అమెరికా కూడా వెళ్లి తన సేవలను అందించారు  7-8 తరగతిలోకి నేను వచ్చేసరికి  ఆరుమళ్ళ భ్రమరాంబ  మా గ్రామంలో కళాశాలలో చదివిన మొదటి స్త్రీ  తర్వాత పిహెచ్డి కూడా చేసింది  కారణాంతరాల వల్ల ఎన్ని ఉద్యోగాలు వచ్చిన  చేయకుండా వివాహం చేసుకొని గృహిణిగా జీవితాన్ని కొనసాగించింది తర్వాత నాతో పాటు చదివిన  బొమ్మా రెడ్డి, రామకోటి రెడ్డి  (చెవులకు పెద్ద బెజ్జాలు ఉండడంతో బొక్కల కోటిరెడ్డి అని పిలిచేవాళ్ళు) ఓనమాల దగ్గర నుంచి మా పాటి బండ శ్రీమన్నారాయణ గారి దగ్గర  నేర్చుకున్నాం  ఐదవ తరగతి వరకు వారి శిష్యరికం  తరువాత ఉన్నత పాఠశాల ఆ తర్వాత కళాశాల  అంతవరకు కలిసే ఉన్నాం.
చిన్నతనం నుంచి గ్రంథాలయం అంటే మాకు చాలా ఇష్టం  కోటిరెడ్డి ఇంటి ప్రక్కనే రామ సుబ్బారెడ్డి గారు  ఉండేవారు గ్రంథాలయంలో ఉన్న చాలా పుస్తకాలను వారింటికి తీసుకొని వెళ్లి  ఆయన బైండు చేస్తున్న సమయంలో నేను కోటి రెడ్డి ఆయనకి సహాయం గా ఉండే వాళ్ళం  వీళ్ళ ఇద్దరి వల్లే నేను వెళ్లి పుస్తకాలు చేయగలిగానని గ్రంథాలయంలో మా పెద్ద వారందరికీ చెప్పారు  రామ సుబ్బారెడ్డి గారు  మొదట నుంచి మేము చదువులో ఎంత ముందు ఉండేవాళ్ళమో ఆటల్లో కూడా  సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా  అంత ముందు ఉండే కార్యక్రమాలను నడిపించే వాళ్ళ  చర్చ గాని గోష్టి గాని ఏర్పాటు చేసినప్పుడు  నేను కానీ వాడు కానీ నిర్వాహకుడుగా ఉండేవాళ్లం  అందుకు మా ఉపాధ్యాయుల సహకారం ఎంతో ఉండేది  మేము ఎలా మాట్లాడాలి  సభా కార్యక్రమాలు  ఎలా నిర్వహించాలి అనేది అక్కడే నేర్చుకున్నాం. స్కూల్లో ఎప్పుడు ఖాళీ దొరికిన అప్పుడు మా ప్రక్కనే ఉన్న  ఆట స్థలంలో చింత చెట్లు ఎక్కి కోతి కొమ్మచ్చు లాంటి మాటలతో కాలక్షేపం చేసేవాళ్ళం  ఒకరోజు అనుకోకుండా ఏదో ఒక ఆటలో  మాట మాట పెరిగి ఇద్దరం కొట్టుకున్నాం  వాడి ఇంటికి వెళ్లి వాళ్ళ తాత గారితో చెప్పాడు  ఆయన మాకు  గ్రామానికి పెత్తందారు  ఆయన పేరు మాకు తెలియదు పెత్తందారనే పిలిచేవాళ్ళు  మా ఇంటికి వచ్చి స్నేహాలు ఎలా ఉండాలి  మాటలతో మైమరిచి పోవాలి తప్ప ఇలా కొట్టుకోవడం, తిట్టుకోవడం స్నేహితుల లక్షణం కాదు. ఎలాంటి సమస్య వచ్చినా మాటలతో పరిష్కరించుకోవాలి తప్ప కొట్లాట వరకు వెళ్లకూడదు  దీనివల్ల స్నేహాలు విచ్ఛిన్నమైపోతాయి ఒకరికొకరు బద్ద విరోధులై జీవితాలను  అంతం చేసుకుంటారు  అని ఎంతో మృదువుగా  మా ఇద్దరినీ కూర్చోబెట్టి చెప్పారు. ఆయన చెప్పిన విధానం నాకు చాలా గొప్పగా నచ్చింది  అది నా జీవితంలో ఎంతో ఉపయోగకారిగా ఉంది.

కామెంట్‌లు