మన గన్నవరం- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 మామయ్య మద్రాస్ లో బిఏ చదువుతుండగా కంభంపాటి జూనియర్  మోహన్ కుమార్ మంగళం లాంటి కమ్యూనిస్టుల పరిచయం ఏర్పడి మార్క్స్ స్ట్ ప్రభావం మరింత బలపడింది 42లో కమ్యూనిస్టు పార్టీ పత్రిక ప్రజాశక్తి దినపత్రిక రావడంతో బొమ్మా రెడ్డి అందులో ఆయన పాత్రికేయ జీవితంలో తొలిమెట్టు  కొన్నాళ్లకే పత్రికను ప్రభుత్వం నిషేధించినా బొమ్మా రెడ్డి పత్రికా రంగాన్ని విడవ లేక ఆనాటి ఆనందవాణి పత్రికకు అంతర్జాతీయ విషయాలపై వ్యాసాలు రాస్తూ ఉండేవాడు  కమ్యూనిస్టు నాయకులందరూ అజ్ఞాతవాసానికి వెళ్లిపోయారు బొమ్మా రెడ్డి మాత్రం గన్నవరం తాలూకా కపిలేశ్వరపురం వద్ద రహస్యంగా జరుపుతున్న రాజకీయ తరగతులను నిర్వహిస్తూ ఉండేవారు  అప్పట్లో జనతా పత్రికలో ప్రచురిస్తున్న గంగినేని వెంకటేశ్వర రావు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వానికి కబురు పంపారు. జనతాపత్రికను కమ్యూనిస్టు పార్టీ తీసుకొని బొమ్మా రెడ్డిని మా భూమి నాటక కర్త వాసిరెడ్డి భాస్కరరావుని సంపాదకునిగా నియమించింది. ఒకటిన్నర సంవత్సరం విజయవంతంగా నిర్వహించారు  అప్పుడు బొమ్మా రెడ్డిని భాస్కర్ రావుల్ని మద్రాస్ వెళ్ళమని పార్టీ ఆదేశించింది మద్రాసులో కమ్యూనిస్టు పార్టీ ఒక లా విద్యార్థి పేరుతో సందేశం అనే వారపత్రికను నడిపింది బొమ్మా రెడ్డి ఆ పత్రికలో  పనిచేస్తున్న సమయంలో తాపీ ధర్మారావు గారి జనవాణి పత్రికలో చేరవలసిందిగా పార్టీ ఆదేశించింది  బొమ్మరిల్లు జనశక్తిలో తాపీ ధర్మారావు కుమారుడు మోహన్ రావు తో కలిసి పనిచేశారు మద్రాస్ లో బొమ్మా రెడ్డి కమ్యూనిస్టు పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉండేది ఆంధ్రలో పార్టీ మీద ప్రభుత్వం నిఘా ఎక్కువ కావడంతో నాయకులు మద్రాస్ కొచ్చి తల దాచుకునేవారు. వారికి వసతి ఏర్పాటు చేసే బాధ్యత బొమ్మా రెడ్డి లాంటి యువకులు పై ఉండేది. ఎప్పుడు పోలీసుల కన్ను తమపై పడుతుందో అనే  ఆలోచనతో ప్రాణాలకు తెగించి పని చేయవలసి వచ్చేది తెలంగాణ పోరాటం ముగిసి ఆంధ్ర లోకి తిరిగి పనిచేయడానికి అనువైన పరిస్థితులు ఏర్పడడంతో బొమ్మా రెడ్డి విజయవాడ చేరుకొని ప్రజాశక్తి వార పత్రికలో పని చేయడం ప్రారంభించారు  తర్వాత ప్రజాశక్తిని నిలిపివేసి విశాలాంధ్ర దినపత్రికను ప్రారంభించారు బొమ్మారెడ్డి విశాలాంధ్ర సంపాదక వర్గంలో చేరి దాదాపు 12 సంవత్సరాలు పార్టీ చీలిపోయేంతవరకు అందులో పని చేశారు  పార్టీ చీలిక తర్వాత సిపిఐఎం తరపున ప్రజాశక్తి వార పత్రిక వెలువడుతూ ఉండేది ఆ పత్రికను జనశక్తి చేయడంతో పత్రిక నిర్వహణ బాధ్యతను పార్టీ బొమ్మా రెడ్డికి అప్పగించింది.
కామెంట్‌లు